క్రితం ట్రేడింగ్‌లో భారీ నష్టాలను మూటగట్టుకున్న దేశీయ స్టాక్‌మార్కెట్లు మంగళవారం కోలుకున్నాయి. నష్టాలతో ట్రేడింగ్ ఆరంభించిన సెన్సెక్స్, నిఫ్టీ చివరకు మంచి లాభాలతో ముగిశాయి. ఉదయం ట్రేడింగ్ ఆరంభంలో బ్యాంకింగ్ రంగ షేర్లతోపాటు ఆటోమొబైల్, లోహ రంగ షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తడంతో సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి. 100 పాయింట్లకు పైగా నష్టంతో ట్రేడింగ్‌ను మొదలుపెట్టిన సెన్సెక్స్.. కాసేపటికే 200 పాయింట్ల వరకు కోల్పోయింది. ఆ తర్వాత కాస్త కోలుకున్న సూచీలు నెమ్మదిగా లాభాల బాట పట్టాయి. ఓ దశలో 400 పాయింట్ల వరకు లాభాలను ఆర్జించింది. నిఫ్టీ కూడా 11 వేల ఎగువకు చేరింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 347 పాయింట్ల లాభంతో 36,652 వద్ద, నిఫ్టీ 100 పాయింట్ల లాభంతో 11,067 వద్ద ముగిశాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.65తో స్థిరంగా ఉంది. ఎన్‌ఎస్‌ఈలో హెచ్‌డీఎఫ్‌సీ, కొటక్ మహింద్రా, యాక్సిస్ బ్యాక్, సన్ ఫార్మా, మారుతీ సుజుకీ షేర్లు టాప్ గెయినర్లుగా నిలిచాయి. మరోవైపు యాక్సిస్ బ్యాంక్, వొడాఫోన్ ఐడియా, భారతీ ఇన్‌ఫ్రాటెల్, యస్ బ్యాంక్, గెయిల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ తదితర షేర్లు టాప్ లూజర్లుగా నిలిచాయి.