YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఘనంగా మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకలు : సిఎస్

ఘనంగా మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకలు : సిఎస్

వచ్చే అక్టోబరు 2వతేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు.మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకలకు సంబంధించి మంగళవారం అమరావతి సచివాలయంలో వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో సిఎస్ మాట్లాడుతూ గ్రామ గ్రామాన ఈవేడుకలు ఘనంగా నిర్వహించేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.అదే విధంగా అన్ని పాఠశాలలు,వసతి గృహాల్లో గాంధీ సిధ్దాంతాలపై పలు స్లోగన్ లు వ్రాయించడం, పెయింటింగ్ చేయడం వంటివి చేపట్టాలని సూచించారు.ప్రతి విద్యార్ధి మహాత్మాగాంధీ,స్వాతంత్ర్య సమరయోధులు గురుంచి తెల్సుకునేలా వ్యాస రచన పోటీలు,ఇతర అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి గ్రామంలోను మహాత్మాగాంధీ పేరిట పార్కులకు నామకరణం చేసేలా చూడాలని,ప్రతి కార్యాలయంలో విధిగా గాంధీ పొటో ఉండేలా చూడాలని సమాచారశాఖ కార్యదర్శి సూచించగా వెంటనే తగు ఆదేశాలు జారీ చేయాలని సాధారణ పరిపాలనాశాఖ కార్యదర్శిని సిఎస్ ఆదేశించారు. బాలికలపై హింస నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను సిఎస్ దినేష్ కుమార్ ఆదేశించారు. అనంతరం వివిధ శాఖలవారీగా చేయాల్సిన చర్యలను ఆయా శాఖల అధికారులతో సిఎస్ సమీక్షించారు. ఈసమావేశంలో సమాచార పౌరసంబంధాలశాఖ కార్యదర్శి బి.రామాంజనేయులు మాట్లాడుతూ మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకలను పురస్కరించుకుని రాష్ట్రంలో గాంధీ పర్యటించిన ప్రాంతాలు తదితర అంశాలపై 3నిమిషాల నిడివితో కూడిన డాక్యుమెంటరీ చిత్రాన్ని రూపొందిస్తున్నామని తెలిపారు. అక్టోబరు 2వతేదీన దానిని రాష్ట్ర్ర ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. రాష్ట్రంలోని అన్ని సినిమా ధియేటర్లలో ప్రదర్శనకు పంపండం జరుగుతుందని చెప్పారు. ఈడాక్యుమెంటరీలో మహాత్మాగాంధీ 1921లో విజయవాడలోని గాంధీ కొండ సందర్శన, పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండా, పొందూరు ఖద్దరు, నెల్లూరు శాంతి ఆశ్రమం,కాకినాడ గాంధీ సందర్శించిన ప్రాంతాలకు చెందిన ఫోటోలను  పొందుపరుస్తారని పేర్కొన్నారు. అదేవిధంగా సోషల్ మీడియాలో గాంధీజీ జీవన విధానానికి సంబంధించిన వివిధ అంశాలపై పోటీలను నిర్వహించి బహుమతులు అందించేందుకు చర్యలు చేపట్టనున్నట్టు తెలిపారు. ఈవేడుకల్లో పంచాయితీ రాజ్, మున్సిపల్ పరిపాలన, ఖాదీ గ్రామీణ బోర్డులను కూడా భాగస్వాములను చేయాలని సూచించారు. సాధారణ పరిపాలనశాఖ కార్యదర్శి ఎన్.శ్రీకాంత్ మాట్లాడుతూ మహాత్మాగాంధీపై పత్యేక శకటాన్ని రూపొందించాల్సిందిగా సమచారశాఖకు బాధ్యతలు అప్పగించామని అన్నారు. పర్యాటక,సాంస్కృతికశాఖ కార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా మాట్లాడుతూ మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకలను అక్టోబరు 2వతేదీ నుండి దేశవ్యాప్తంగా రెండేళ్ల పాటు నిర్వహించాలని కేంద్రప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్.ఎస్.రావత్ మాట్లాడుతూ అన్ని సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్ధులకు గాంధీజీపైన స్వచ్ఛ భారత్ కార్యక్రమంపైన వ్యాస రచన పోటీలను నిర్వహిస్తున్నామని చెప్పారు. స్త్రీశిశు సంక్షేమశాఖ కమీషనర్ హెచ్.అరుణ్ కుమార్ మాట్లాడుతూ అంగన్ వాడీ కార్యకర్తలతో మరుగుదొడ్లు వినియోగంపై అవగాహనా ర్యాలీలు నిర్వహించనున్నట్టు తెలిపారు. కిశోర బాలికలను వివిధ అంశాలపై సెన్సిటైజేషన్ చేసేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. పాఠశాల,కళాశాల విద్యాశాఖల కమీషనర్లు సంధ్యారాణి, సుజతా శర్మలు మాట్లాడుతూ పాఠశాల,కళాశాలల స్థాయిలో విద్యార్ధులకు వివిధ పోటీలను, డ్రామా పోటీలను నిర్వహించడం జరుగుతోందన్నారు. నెడ్ క్యాప్ ఎండి కమలాకర్ రావు మాట్లాడుతూ సాంప్రదాయేతర ఇంధన వనరులపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు లైవ్ మోడల్లు ప్రదర్శన ఏర్పాటు చేస్తామని అన్నారు. రాష్ట్ర క్రియేటివిటీ,  కల్చర్ కమీషన్ సిఇఓ డా.డి.విజయ్ భాస్కర్ మాట్లాడుతూ గాంధీజీ 150 జయంతి వేడుకలను పురస్క రించుకుని అక్టోబరు 2నుండి 11వతేదీ వరకూ 10 రోజుల పాటు గాంధీ పర్వ్ పేరిట వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు చెప్పారు.

Related Posts