సౌతిండియా సూపర్‌స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్ కాంబినేషన్‌లో శంక ర్ దర్శకత్వంలో వస్తున్న ‘2.0’ ఫస్ట్‌లుక్, టీజర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. టీజర్ యూ ట్యూబ్‌లో జెట్ స్పీడ్‌తో దూసుకుపోతూ 10 కోట్ల మార్క్ వ్యూస్‌ను అందుకుంది. ఒకటిన్నర నిమిషాలు ఉంటుంది ఈ టీజర్. అయితే దీపావళి కానుకగా నవంబర్ 6న ఓ బిగ్ ట్రైలర్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు దర్శకుడు శంకర్. దాదాపు 4, 5 నిమిషాల పాటు ఉండే ఈ ట్రైలర్ అబ్బురపరిచే విధంగా ఉంటుందట. తెలుగు, తమిళం, హిందీ ట్రైలర్లను సిద్ధం చేస్తోంది సినిమా టీమ్. ఈ ట్రైలర్ కోసం అదిరిపోయే రీ రికార్డింగ్‌ను సమకూరుస్తున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ ఎ.ఆర్.రెహమాన్. ఇక ఈ సినిమాలో ఏకంగా 1000 విఎఫ్‌ఎక్స్ షాట్స్ ఉంటాయట. వీటి కోసం ఏకంగా 15 టాప్ రేంజ్ హలీవుడ్ స్టూడియోస్‌లో దాదాపు 3000 మంది రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. ఇది పూర్తిస్థాయి 3డి సినిమా కాబట్టి అందుకు తగ్గట్టే గ్రాఫిక్స్, విఎఫ్‌ఎక్స్ వర్క్ కోసం శ్రమించాల్సి వస్తోంది. నవంబర్ 29న ‘2.0’ సినిమా విడుదలకానుంది. ఈలోగా దీపావళికి అదిరిపోయి ట్రీట్ రెడీ అవుతోంది