YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఆప్ లో్కి సిన్హాలు..!!

ఆప్ లో్కి సిన్హాలు..!!

ప్రధాని నరేంద్ర మోదీ, భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు అమిత్ షాల శత్రువులను తమ పార్టీలోకి చేర్చుకునే యత్నంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. ఢిల్లీలో ప్రధాన పోటీ దారు అయిన భారతీయ జనతా పార్టీని వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ముప్పుతిప్పలు పెట్టాలన్నది ఆమ్ ఆద్మీ పార్టీ యోచన. ఢిల్లీలో అధికారాన్ని ప్రజలు తమకు ఇచ్చినా పాలన సజావుగా సాగకుండా ఎక్కడికక్కడ బీజేపీ అడ్డుకుంటుందన్నది ఆప్ నేతల వాదన. లెఫ్ట్ నెంట్ గవర్నర్ ను ఉపయోగించి తమను ఎలాంటి నిర్ణయాలు తీసుకోనివ్వకుండా నిరోధిస్తున్నారని ఆప్ ఎప్పటి నుంచో ఆరోపణలు చేస్తున్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని హస్తినలో దెబ్బతీయాలన్నది ఆప్ వ్యూహంగా కన్పిస్తోంది. భారతీయ జనతా పార్టీలోని అసమ్మతివాదులను అక్కున చేర్చుకోవడానికి ఆప్ సిద్ధపడింది. ముఖ్యంగా బీజేపీలో సీనియర్ నేతగా వెలిగిన యశ్వంత్ సిన్హాను ఈసారి ఎన్నికల్లో ఆప్ తరుపున బరిలోకి దించాలన్నది ప్రధాన వ్యూహంగా కన్పిస్తోంది. గత కొన్నాళ్ల నుంచి యశ్వంత్ సిన్హా మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా జీఎస్టీ, నోట్ల రద్దు వంటి విషయాలపై యశ్వంత్ సిన్హా మోదీ ప్రభుత్వాన్ని ఇరుకునపెడుతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ యశ్వంత్ సిన్హాను న్యూఢిల్లీ లోక్ సభ నియోజకవర్గం నుంచి బరిలోకి దించాలని నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ఆప్ నేతలు యశ్వంత సిన్హాతో చర్చలు జరిపారు. సిన్హా కూడా పోటీ చేసేందుకు సానుకూలంగా స్పందించారని సమాచారం. యశ్వంత్ సిన్హాను కేవలం న్యూఢిల్లీ లోక్ సభ నియోజకవర్గానికే పరిమితం చేయకుండా మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడటానికి ప్రచారానికి విస్తృతంగా వినియోగించుకోవాలని ఆప్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. యశ్వంత్ సిన్హా అయితేనే కమలం బాస్ లిద్దరికీ చెక్ పెట్టగలరన్నది ఆప్ విశ్వాసంతో ఉంది. బీజేపీలో మరో అసంతృప్త నేత శతృఘ్న సిన్హాను సయితం న్యూఢిల్లీ పశ్చిమ లోక్ సభ నియోజకవర్గం నుంచి ఆప్ తరుపున పోటీ చేయించాలని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ భావిస్తున్నారు. ఛరిష్మా కలిగిన నేత కావడం, పంచ్ డైలాగ్ లతో మోదీని ఇరుకున పెట్టేందుకు ఉపయోగపడతారని చెబుతున్నారు. శతృఘ్న సిన్హా వాస్తవానికి బీహార్ లోని పాట్నా సాహిబ్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. ఈసారి బీజేపీ శతృఘ్న సిన్హాకు టిక్కెట్ ఇచ్చే ఛాన్స్ లేదు. ఆయన స్థానంలో బీహార్ ఉపముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీని పోటీ చేయించాలన్న ఆలోచనలో బీజేపీ కేంద్ర నాయకత్వం ఉంది. దీంతో శతృఘ్న సిన్హాను తమ పార్టీలోకి తీసుకొచ్చి ఢిల్లీ పశ్చిమ లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని భావిస్తోంది. తమకు పట్టున్న హర్యానా, పంజాబ్, ఢిల్లీ రాష్ట్రాల్లో ఆప్ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంని మోదీ విజయానికి అడ్డుకట్ట వేయాలన్నది ఆప్ వ్యూహంగా కన్పిస్తోంది. మరి ఎంతవరకూ సక్సెస్ అవుతుందో చూడాలి.

Related Posts