YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఉండవల్లి వర్సెస్ కుటుంబరావు

ఉండవల్లి వర్సెస్ కుటుంబరావు

ఏదైనా మాట్లాడితే చంద్రబాబుపై కక్ష గా మాట్లాడుతున్నట్లు లెక్కగడుతున్నారే తప్ప వాస్తవాన్ని అర్ధం చేసుకోవడం లేదని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. అమరావతి బాండ్ల వ్యవహారం గురించి లేవనెత్తి అంశాలపై ప్రభుత్వ ఆర్ధిక సలహాదారు కుటుంబరావు చర్చకు అంగీకరించారని,దాంతో తాను వెళ్లి కలిశానని,అయితే చంద్రబాబు అమెరికా పర్యటన,ఆర్ధిక వేత్తల బృందం రావడం వంటి పరిణామాల వలన వచ్చేవారం చర్చిద్దామని చెప్పారని, అందుకే రెండు రోజుల్లో అమరావతి వెళతానని ఉండవల్లి చెప్పారు. అన్నక్యాంటీన్లలలో కూడా అవినీతి రాజ్యమేలుతోందని ,వివరాలు త్వరలో వెల్లడిస్తానని ఆయన చెబుతూ కుటుంబరావుకి అంగీకారమైతే పోలవరం కాగ్, ఆదరణ, అన్నక్యాంటీన్లపై చర్చించడానికి రావాలని కోరారు.పోలవరం 2019 కి పూర్తి చేయడం సాధ్యకాదని కాగ్ నివేదిక చెప్పినందున ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు నిజానికి పోలవరం ప్రాజెక్టు లో ప్రధాన కాల్వల టన్నల్స్ పనులు మొదలు కానేలేదని,ఇక డ్యాం నిర్మాణపనులు ఇంకా మొదలుకాలేదని, అందుకే 2019కి పూర్తయ్యే అవకాశమే లేదని కాగ్ నివేదిక నిగ్గు తేల్చిందని ఉండవల్లి చెప్పారు. రిజర్వాయరు నిండిన తర్వాత దిగువ ధవళేశ్వరం బ్యారేజ్ కు నీరు విడుదల చేయడానికి స్పిల్ వే అవసరం అవుతుందని, అసలు డ్యామ్ లేకుండా అదే స్పిల్ వే చూపించి పోలవరం పనులు శరవేగమంటూ జనాన్ని తీసుకెళ్ళి చూపిస్తున్నారని ఆయన విస్మయం వ్యక్తం చేసారు.రిజర్వాయరు పూర్తయితేనే ప్రయోజనం ఉంటుందన్నారు. ఇక ఏ నిర్మాణం చేసినా క్వాలిటీ పరిశీలన అనేది ఉంటుందని,అయితే పోలవరం లో థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోలు లేద నే విషయం తేటతెల్లం అయిందని ఇదే విషయాన్ని కాగా ప్రస్తావిస్తూ థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోలు ఎందుకు చేయడంలేదని ప్రశ్నించిందని ఉండవల్లి గుర్తుచేశారు. పోలవరం పనుల్లో జరుగుతున్న తప్పులను కాగ్ ఎత్తిచూపి నప్పటికీ ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదన్నారు. కనీసం నాలుగేళ్ళల్లో కాగ్ నివేదికలపై కనీసం చర్చ కూడా చేయకపోవడం దారుణమన్నారు. అగ్రిమెంట్ లో పది శాతం కూడా పనులు కాలేదు..పైగా డబుల్ పేమెంట్స్ఇస్తున్నారని ఆయన విమర్శించారు.అమరావతి బాండ్ల గురించి ప్రస్తావించినప్పుడు కుటుంబరావు ద్వారా మాట్లాడించిన ప్రభుత్వం మరి పోలవరం గురించి ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ చేత ఎందుకు సమాధానం చెప్పించలేదని ఉండవల్లి ప్రశ్నించారు. అసలు పోలవరం భేతాళ కథలా అన్పిస్తోందన్నారు. ఇదంతా చూస్తుంటే, చంద్రబాబు ప్రభుత్వం నడుపుతున్నారా? లేదా? అన్న అనుమానం వస్తోందన్నారు. ‘ఇంజనీర్లను మీడియా ముందు పోలవరం గురించి చెప్పమనండి ఇదే పోలవరం పై నా ఆఖరు ప్రెస్ మీట్. సమాధానం చెబితే దీనిపై ఇక ప్రెస్ మీట్స్ ఆపేస్తా”అని ఉండవల్లి ప్రకటించారు.ముహూర్తాలు పాలైతే ఇలాగే చనిపోతారని పుష్కరఘటనపై సోమయాజులు కమిషన్ రుజువు చేసిందని ఉండవల్లి ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పై నక్సలైట్లు కాల్పులు జరిపి చెంపేస్తే, పోలీసులను సస్ప్ండ్ చేశారని, అయితే 30 మంది పుష్కర తొక్కిసలాట లో చనిపోతే హోం గార్డుకు కూడా పనిష్మెంట్ లేదని ఆయన విచారం వ్యక్తం చేసారు. సంప్రదాయాన్ని తప్పుపడుతూ సోమయాజులు కమిషన్ నివేదిక ఇచ్చిందని ఆయన పేర్కొంటూ ఇది మంచిపద్ధతి కాదన్నారు. సిసి ఫుటేజ్ లు ఏమయ్యాయో తెలీయదనడం దారుణంగా ఉందన్నారు. కనీసం కలెక్టర్ ఇచ్చిన నివేదికపై కూడా చర్చించలేదని, కలెక్టర్ ని విచారణకు పిలవలేదని ఆయన అన్నారు.

Related Posts