YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ధార్‌ఫై సుప్రీం తీర్పు భాజపాకు చెంపపెట్టు: కాంగ్రెస్‌

ధార్‌ఫై సుప్రీం తీర్పు భాజపాకు చెంపపెట్టు: కాంగ్రెస్‌

భారత విశిష్ట ప్రాధికార గుర్తింపు సంఖ్య(ఆధార్‌) రాజ్యంగ బద్ధమైనదేనంటూ సుప్రీంకోర్టు వెల్లడించిన కీలక తీర్పును ప్రతిపక్ష కాంగ్రెస్‌ స్వాగతించింది. ఆధార్‌ తీర్పు భాజపాకు చెంపపెట్టు అని విమర్శించింది. అయితే ఈ ఆధార్‌పై కొన్ని షరతులు వర్తిస్తాయని.. ప్రయివేటు వ్యక్తులు లేదా కంపెనీలు ఆధార్‌ కోరడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ‘ఆధార్‌ చట్టంలోని సెక్షన్‌ 57ను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మేం స్వాగతిస్తున్నాం. ఇక ప్రయివేటు సంస్థలు ధ్రువీకరణ ప్రక్రియ కోసం ఆధార్‌ డేటా తీసుకోడానికి వీలులేదు’ అని కాంగ్రెస్‌ తమ అధికారిక ట్విటర్‌ ఖాతాలో పేర్కొంది. తీర్పుపై కాంగ్రెస్‌ జాతీయ అధికార ప్రతినిధి అభిషేక్‌ మను సింఘ్వీ స్పందిస్తూ.. ‘ఈ తీర్పు భాజపాకు చెంపపెట్టు. ఆధార్‌ చట్టంలోని సెక్షన్‌ 57ను జస్టిస్‌ సిక్రీ కొట్టివేశారు. ప్రయివేటు వ్యక్తులు ఆధార్ డేటా తీసుకోవడం రాజ్యాంగబద్ధం కాదని కోర్టు తెలిపింది’ అని ట్వీట్‌ చేశారు.అటు తృణమూల్‌ పార్టీ కూడా ఈ తీర్పును స్వాగతించింది. ‘ఆధార్‌ చట్టంలోని సెక్షన్‌ 57ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇకపై బ్యాంకులు, స్కూళ్లు, మొబైల్‌ కంపెనీలకు ఆధార్‌ డేటాను ఇవ్వాల్సిన అవసరం లేదు. దీనికోసం తృణమూల్‌ పార్టీ ఎంతగానో పోరాడింది’ అని తృణమూల్‌ కాంగ్రెస్‌ ట్వీట్ చేసింది.

Related Posts