YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

ఏడాదిలో 44 శాతం మేర పెరిగిన అంబానీ ఆదాయం

ఏడాదిలో 44 శాతం మేర పెరిగిన అంబానీ ఆదాయం

సంపన్న భారతీయుల జాబితాలో పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌  అంబానీ మరోసారి అగ్రస్థానం కైవసం చేసుకున్నారు. 2018 సంవత్సరానికిగాను 'బార్‌క్లేస్‌-హురున్‌ ఇండియా' సంస్థ రూపొందించిన సంపన్నుల జాబితాలో.. ముకేశ్ అంబానీ రూ.3.71 లక్షల కోట్ల సంపదతో వరుసగా ఏడోసారి అగ్రస్థానంలో నిలిచారు. ఏడాది కాలంలోనే అంబానీ సంపద 44 శాతం మేర పెరిగింది. గడిచిన ఏడాది కాలంలో ముకేశ్  సంపద రోజుకు రూ.300 కోట్లు (ఏడాదిలో రూ.1,09,500 కోట్లు) పెరిగింది. అంటే ఈ లెక్కన ముకేశ్ సంపాదన గంటకు రూ.12.5 కోట్లు.. నిమిషానికి రూ.21 లక్షలు, సెకనుకు రూ.35 వేలు అన్నమాట.ముకేశ్ అంబానీ తర్వాతి స్థానాల్లో వరుసగా.. హిందూజ (రూ.1.59 లక్షల కోట్లు), ఎల్‌ఎన్‌ మిట్టల్‌ (1.14 లక్షల కోట్లు), అజీమ్‌ ప్రేమ్‌జీ  (రూ.96,100 కోట్లు) ఉన్నారు. ఈ ముగ్గురు ఆస్తులు కలిపితే ఎంత అవుతుందో అంతగా ముఖేష్ ఆస్తిగా ఉన్నట్లు సర్వే వెల్లడించింది.ఇక జాబితాలో సన్‌ ఫార్మా అధినేత దిలీప్‌ సంఘ్వీ (రూ.89,700 కోట్లు) ఐదో స్థానంలో ఉన్నారు. ఆరో స్థానంలో కొటక్‌ మహీంద్రా బ్యాంకు ఎండీ ఉదయ్‌ కొటక్‌ (రూ.78,600 కోట్లు), సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన సైరస్‌ ఎస్‌.పూనవల్ల (73,000), ఆదానీ ఎంటర్‌ప్రైజెస్‌ అధినేత గౌతం ఆదానీ (రూ.71,200 కోట్లు), సైరస్‌ పల్లోంజీ మిస్త్రీ (రూ.69,400) తర్వాతి  స్థానాల్లో నిలిచారు.అత్యంత సంపన్న పది కుటుంబాల్లోనూ మొదటి స్థానాన్ని అంబానీ కుటుంబమే దక్కించుకుంది. తర్వాతి స్థానాల్లో గోద్రేజ్‌, హిందూజ, మిస్త్రీ, సంఘ్వీ, నాడార్‌, అదానీ, దామానీ, లోహియా, బుర్మాన్‌లు ఉన్నారు.

Related Posts