YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

కార్యాకలాపాలు ప్రారంభించిన ఫ్లెక్స్ ట్రానిక్స్

కార్యాకలాపాలు ప్రారంభించిన  ఫ్లెక్స్ ట్రానిక్స్

నెల్లూరు జిల్లా త‌డ స‌మీప శ్రీసిటిలో ఏర్పాటు అవుతున్న ఫ్లెక్స్ ట్రానిక్స్ సంస్థ మొబైల్ ఫోన్స్,సర్క్యూట్ బోర్డ్ తదితర ఎలక్ట్రానిక్స్ తయారు చేస్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో స్థాపించే సంస్థ‌ల‌కు ఏపీ యువ‌త‌కే ఉద్యోగావ‌కాశాలు క‌ల్పించే ల‌క్ష్యంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఇన్ఫ‌ర్మేష‌న్ అండ్ టెక్నాల‌జీ సంస్థ ప‌నిచేస్తోంది. ప్రపంచంలోనే ఐదు అతి పెద్ద ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీల్లో ఒక్కటైన కంపెనీ ఫ్లెక్స్ ట్రానిక్స్  సుమారుగా రూ.585 కోట్లు పెట్టుబడితో శ్రీసిటిలో త‌న కార్య‌క‌లాపాలు ప్రారంభించబోతుంది. 30 కి పైగా దేశాల్లో 2 లక్షలకు పైగా ఉద్యోగాలు క‌ల్పించిన ఫ్లెక్స్ ట్రానిక్స్ ఏపీలో సుమారుగా 6,600 మందికి ఉద్యోగాలు క‌ల్పించ‌నుంది.ఐటీ, ఎల‌క్ర్టానిక్స్ శాఖ‌ల‌ను చూస్తున్న మంత్రి లోకేష్ ఏడాదిన్న‌ర క్రితం బాధ్య‌త‌లు స్వీక‌రించారు. అప్పుడే ఎలక్ట్రానిక్స్ రంగంలో 2 లక్షల ఉద్యోగాల కల్పించాల‌ని, ఏపీని ఐటీ, ఎల‌క్ర్టానిక్స్ రంగాల్లో నెంబ‌ర్‌వ‌న్‌గా తీర్చిదిద్దాల‌ని లక్ష్యంగా పెట్టుకున్నారు. మ‌న దేశంలో బెంగళూరు, ముంబై, ఢిల్లీ వంటి న‌గ‌రాల‌లో ప‌ర్య‌టించారు. అక్క‌డ క‌ల్పించిన సౌక‌ర్యాలు.. వ‌చ్చిన కంపెనీల‌ను ప‌రిశీలించారు. ఓ ప్ర‌ణాళిక రూపొందించుకున్నారు. అమెరికా, దావోస్, తాజాగా చైనా దేశాల్లో పర్యటించి.. ఏపీ ఇస్తున్న రాయితీలు, కంపెనీల స్థాప‌న‌కు క‌ల్పిస్తున్న సౌక‌ర్యాల‌ను మంత్రి నారా లోకేష్ వివిధ కంపెనీల ప్రతినిధులకు వివరించారు. ఐటీ, ఎల‌క్ర్టానిక్స్‌ పాలసీ, రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ల గురించి వివరించి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలి అని ఆహ్వానించారు. మ‌రోవైపు కంపెనీలు ఏపీలో సంస్థ‌లు స్థాపించేలా ఒప్పిస్తున్నారు.ప్రపంచంలోనే ఐదు అతి పెద్ద ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీల్లో ఒక్కటైన ఫ్లెక్స్ ట్రానిక్స్ ని ఆంధ్రప్రదేశ్ కి తీసుకురావ‌డంలో మంత్రి లోకేష్ కృషి కీల‌క‌మైంది. బెంగ‌ళూరు,తిరుపతిలో ఫ్లెక్స్ ట్రానిక్స్ కంపెనీ ప్రతినిధులతో పలుమార్లు సమావేశం అయ్యి ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అనువైన పరిస్థితుల గురించి వివరించారు. మంత్రి లోకేష్ అప్ప‌గించిన బాధ్య‌త‌లలో భాగంగా ఎలక్ట్రానిక్స్ టీం నిత్య‌మూ ఫ్లెక్స్ ట్రానిక్స్ కంపెనీ ప్రతినిధులతో టచ్ లో ఉండి కంపెనీని తీసుకురాగ‌లిగారు. ఫ్లెక్స్‌ట్రానిక్స్‌తోపాటు దీని స‌ప్ల‌య‌ర్స్ కంపెనీలు కూడా ఏపీకి వ‌చ్చే అవ‌కాశాలున్నాయి. అవి కూడా వ‌స్తే వేల‌సంఖ్య‌లో యువ‌త‌కు ఉద్యోగావ‌కాశాలు ల‌భిస్తాయి.సంస్థ‌లో 1100వ‌ర‌కూ ఉన్న ఉద్యోగాల‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఇన్ఫ‌ర్మేష‌న్ అండ్ టెక్నాల‌జీ అకాడ‌మీ ఆధ్వ‌ర్యంలో జ‌రిగే జాబ్ మేళా ద్వారా ఎంపిక చేయ‌నున్నారు. 8వ త‌ర‌గ‌తి పాసై..18 నుంచి 23 ఏళ్ల మ‌ధ్య‌ వ‌య‌స్సు ఉన్న యువతులు అర్హుల‌ని సంస్థ ప్ర‌తినిధులు ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. ఈ అర్హ‌త‌లు ఉన్న‌వారు త‌మ విద్యార్హ‌త‌,ధ్రువ‌ప్ర‌తాల‌తో శ్రీసిటీ ఫైర్‌స్టేష‌న్ ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ ట్ర‌స్ట్ స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ సెంట‌ర్‌లో అధికారుల‌ను సంప్ర‌దించాల‌ని తెలిపారు.అక్టోబ‌ర్ 1వ తేదీలోగా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని, ఎంపికైన వారిని మొబైల్ లైన్ అసెంబ్లీ ఆప‌రేట‌ర్ ఉద్యోగాల‌లో నియ‌మిస్తార‌ని ప్ర‌క‌టించారు. రెండు నెల‌ల్లో 3 వేల మందికి ఫ్లెక్స్ ట్రానిక్స్ సంస్థ‌లో ఉద్యోగాలు క‌ల్పించ‌నున్నారు.

Related Posts