బంగ్లాదేశ్ ఆసియాకప్ ఫైనల్లో అడుగుపెట్టింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 37 పరుగుల తేడాతో పాకిస్థాన్‌పై విజయం సాధించింది. ముష్ఫికర్ రహీమ్ (99; 116 బంతుల్లో 9×4), మహ్మద్ మిథున్ (60; 84 బంతుల్లో 4×4) రాణించడంతో మొదట బంగ్లా 48.5 ఓవర్లలో 239 పరుగులు సాధించింది. జునైద్ ఖాన్ (4/19) నాలుగు వికెట్లతో చెలరేగగా.. షా అఫ్రీది, హసన్ అలీ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. లక్ష్య ఛేదనలో ముస్తాఫిజుర్ (4/43) దెబ్బకు పాక్ ఓవర్లన్నీ ఆడి 202/9 స్కోరు మాత్రమే చేసింది. ఓపెనర్ ఇమాముల్ హక్ (83) టాప్ స్కోరర్. ఫైనల్లో భారత్ తో రేపు తలపడనుంది.