YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కర్ణాటకలో ఊపిరి పీల్చుకున్న కుమారస్వామి

కర్ణాటకలో ఊపిరి పీల్చుకున్న కుమారస్వామి

కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వం కొన్నాళ్లు మనుగడ సాగించేలానే ఉంది. అసమ్మతి నేతలు కొంత దారిలోకి వచ్చారు. మంత్రివర్గ విస్తరణ వచ్చే నెల 3వ తేదీ తర్వాత ఉంటుందని తెలియడంతో మరోసారి తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇందుకు నిన్న మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలో జరిగిన శాసనసభ పక్ష సమావేశమే సాక్ష్యం. ఈ సమావేశానికి అసమ్మతి నేతలందరూ హాజరయ్యారు. ఈ సమావేశానికి 78 మంది ఎమ్మెల్యేలు హాజరుకావడంతో కాంగ్రెస్ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. సిద్ధరామయ్య స్వయంగా ఫోన్ చేసి అసమ్మతి నేతలను సమావేశానికి ఆహ్వానించడంతోనే వారు వచ్చినట్లు తెలుస్తోంది.అయితే సమావేశానికి హాజరైన నేతలు తమ అసంతృప్తిని కొంత బాహాటంగానే వెళ్లగక్కారు. ముఖ్యంగా కుమారస్వామి, ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర ల మీద అసంతృప్త నేతలు ఫైర్ అయినట్లు సమాచారం. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఒక జట్టుగా ఏర్పడి తమ నియోజకవర్గాల అభివృద్ధిని అడ్డుకుంటున్నారని, తమకు తెలియకుండానే అధికారుల బదిలీలు జరుపుతున్నారని, తమ నియోజకవర్గాల్లో వారి జోక్యమేంటని వారు నేరుగానే ప్రశ్నించారు. తమకు కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం ఉందని, అయితే సంకీర్ణంలో జరుగుతున్న విషయాలను కూడా పార్టీ అగ్రనేతలు గుర్తించాలని పలువురు ప్రశ్నించినట్ల తెలుస్తోంది.ఇందుకు సిద్ధరామయ్య కూడా కొంత అంగీకరించారని చెబుతున్నారు. సంకీర్ణ ప్రభుత్వంలో ఏక పక్ష నిర్ణయాలు చెల్లవని, సమిష్టి నిర్ణయాల వల్లనే ఎక్కువ కాలం ప్రభుత్వం ఉంటుందని సిద్ధరామయ్య వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కుమారస్వామి సమన్వయ కమిటీతో చర్చించకుండానే అధికారులను బదిలీ చేయడాన్ని కూడా ఈ సందర్భంగా సిద్ధరామయ్య తప్పు పట్టినట్లు చెబుతున్నారు. కాలం కలసి రాక ఎక్కువ సంఖ్యలో సీట్లు వచ్చినా కుమారస్వామికి ముఖ్యమంత్రి పదవి అప్పగించామని, దాన్ని ఆసరాగా తీసుకుని రెచ్చగొట్టే యత్నాలు చేస్తే ఇద్దరికీ నష్టమని ఆయన తేల్చి చెప్పినట్లు సమచారం.కర్ణాటక రాష్ట్రంలో జరిగే లోక్ సభ ఎన్నికల్లో కూడా జేడీఎస్, కాంగ్రెస్ పని చేయాలంటే కుమారస్వామి అందరినీ కలుపుకుని పోవాలని సూచించారు. సమన్వయ కమిటీ సమావేశంలో ఈ విషయాలను కుమారస్వామికి గట్టిగా చెప్పాలని నిర్ణయించారు. కుమారస్వామి తీసుకున్న తాజా నిర్ణయాన్ని కూడా వెనక్కు తీసుకోవాలని సమావేశంలో పలువురు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 140 మంది వరకూ సీఐలను బదిలీ చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే నిలుపుదల చేయించారు. ఎమ్మెల్యేలకు తెలియకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఆ ప్రభావం సంకీర్ణ సర్కార్ పై పడే అవకాశముందని కుమారస్వామికి ఒకింత హెచ్చరికలు కాంగ్రెస్ పార్టీ పంపినట్లయింది. మొత్తం మీద కాంగ్రెస్ అసమ్మతి నేతలు కొంత తగ్గినా..కుమారస్వామి నిర్ణయాలు మళ్లీ సంకీర్ణంలో వేడిపుట్టిస్తున్నాయని చెప్పక తప్పదు.

Related Posts