YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

తాడేపల్లిగూడెంలో ఈ నెల 29వ ధర్మపోరాట దీక్ష

తాడేపల్లిగూడెంలో ఈ నెల 29వ ధర్మపోరాట దీక్ష

రాష్ట్రాభివృద్ది కాంక్షతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పనిచేస్తున్నారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ , జిల్లా ఇన్ ఛార్జి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. కొవ్వూరులో ఎ క్సైజ్ శాఖా మంత్రి కె.యస్.జవహర్ క్యాంపు కార్యాలయంలో గురువారం పాత్రికేయుల సమావేశంలో మంత్రి పుల్లారావు మాట్లాడుతూ రాష్ట్రాన్ని ప్రపంచ పఠంలో అభివృద్దికి సూచికగా రూపొందించేందుకు ముఖ్యమంత్రి అహర్నిశలు కృషి చేస్తున్నారని అటువంటి నాయకునిపై బురద చల్లేందుకు ప్రయత్నించే ప్రతిపక్షాలకే ఆ బురద అంటుకుంటుందన్నారు. రాష్ట్రంలోని ప్రజలకు త్రాగు, సాగునీరును పూర్తిగా అందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి జల దీక్ష తీసుకున్నారని, ఈ కార్యక్రమంలో భాగంగా 55 సాగునీటి ప్రోజెక్టులను పూర్తి చేసే లక్ష్యంతో ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని, ఒకే రోజు 3 ప్రోజెక్టులను ప్రారంభించారన్నారు. ప్రతిపక్షాలు కేవలం అధికార కాంక్ష, ధనదాహంతో ముఖ్యమంత్రిపై లేనిపోని విమర్శలు చేస్తున్నాయని, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ది చూసైనా ప్రతిపక్షాలు బురద చల్లడం మానుకోవాలన్నారు. తమ స్వంత రాజకీయ లబ్ది కోసం కోర్టులను వాడుకోవద్దని న్యాయస్థానాలు చివాట్లు పెట్టినా ప్రతిపక్షాలకు ఇంకా బుద్దిరాలేదన్నారు.
లక్షా యాభైవేల మందితో ధర్మపోరాట దీక్ష: కేంద్ర ప్రభుత్వం చేసిన నమ్మకద్రోహంపై ప్రజలను చైతన్యవంతం చేసేందుకే ముఖ్యమంత్రి ధర్మపోరాట దీక్షను చేపట్టారన్నారు. తాడేపల్లిగూడెంలో ఈ నెల 29వ ధర్మపోరాట దీక్ష కార్యక్రమం లక్షా యాభై వేల మంది ప్రజలు పెద్దఎ త్తున పాల్గోంటారన్నారు.
రాష్ట్ర ఎ క్సైజ్ శాఖా మంత్రి కె.యస్.జవహర్ మాట్లాడుతూ విభజన చట్టంలో పొందుపరచిన హామీలను నెరవేర్చకుండా ఆంధ్రరాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం మోసం చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం చేసిన మోసాన్ని ప్రజలకు తెలియజేసేందుకు ముఖ్యమంత్రి ధర్మపోరాట దీక్షను చేపట్టారని, ఈ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములై మన రాష్ట్ర హక్కులను సాధించుకోవాలన్నారు.
రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖా మంత్రి పితాని సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రా హక్కుల సాధనకోసం ముఖ్యమంత్రి ధర్మ పోరాట దీక్ష చేస్తున్నారని, ఇప్పటివరకు 6 జిల్లాలలో ధర్మపోరాట దీక్షను నిర్వహించారన్నారు.

Related Posts