YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

తిరుమలలో జేఈఓ తనిఖీలు

 తిరుమలలో  జేఈఓ తనిఖీలు

దళారీలను అరికట్టేందుకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 100 మంది విజిలెన్సు సిబ్బందితో బ్రేక్ దర్శన టిక్కెట్లను పొందిన భక్తుల ఐడి కార్డులను క్షున్నంగా తనిఖీ చేశామని ఇందుకు భక్తులు కూడా పూర్తిగా సహకరించారని తిరుమల జేఇఓ శ్రీనివాసరాజు తెలిపారు. లక్కి డిఫ్ విధానంలో నకిలి ఐడి కార్డులుతో దర్శనానికి భక్తులు వస్తున్న నేపధ్యంలో సిఫార్సు లేఖలు పై జారి చేసే టిక్కేట్లను తనిఖీ చేసామని అనుమానం వచ్చిన భక్తులకు శ్రీవారి దర్శనభాగ్యం కల్పించిన తరువాత విచారణ జరుపుతామని జేఇఓ అన్నారు. విచారణలో అన్ని విషయాలు వెలుగు చూస్తాయని ఇక పై నిరంతరంగా తనిఖీలు నిర్వహిస్తామని జేఇఓ స్పష్టం చేశారు. వీఐపీ బ్రేక్ టిక్కెట్లపై పిర్యాదు రావడంతో తనిఖీలు నిర్వహించినట్లు  టీటీడీ అడిషనల్ సీవీఎస్వో శివ కుమార్ రెడ్డి తెలిపారు. కొన్ని అనుమానిత టిక్కెట్లను గుర్తించినట్లు ఆయన తెలిపారు. అనుమానిత భక్తులను విచారిస్తున్నాం, ప్రాథమిక  నిర్ధారణకు వచ్చాక వివరాలు తెలివజేస్తాం అని ఆయన మీడియాకి తెలిపారు. అక్రమంగా టిక్కెట్లను విక్రయించినట్లు రుజువు అయితె వారిపై చట్టపరమైన చర్యలు తిరుకుంటామని అడిషనల్ ముఖ్య నిఘా అదికారి శివకుమార్ రెడ్డి పేర్కొన్నారు.

Related Posts