YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కేరళ వరద బాధితులకు అసెంబ్లీ ఉద్యోగులు రూ.2.91 కోట్ల విరాళం

 కేరళ వరద బాధితులకు అసెంబ్లీ ఉద్యోగులు                 రూ.2.91 కోట్ల విరాళం

వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన కేరళ వాసులకు ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అసెంబ్లీ ఉద్యోగులు రూ.2,91,43,466లు విరాళం అందజేయనున్నట్లు శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు. అసెంబ్లీలోని ఒకటో అంతస్తు కమిటీ హాల్ లో గురువారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ విషయం తెలిపారు. వరదలతో కేరళ అతలాకుతలమైందన్నారు. ప్రాణ, ఆస్తినష్టం కలిగిందన్నారు. ఈ విషాదకర సమయంలో కేరళ వాసులకు అండగా ఉండాలని భావించిన ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఆర్థికసాయం అందించిందన్నారు. ఇపుడు ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు అసెంబ్లీ ఉద్యోగులు కూడా ఒక నెల వేతనంతో పాటు ఇతర అలెవెన్సులు విరాళం ఇవ్వాలని నిర్ణయించారన్నారు. శాసనసభ్యులు రూ.2,70,28,466లు, శాసన మండలి సభ్యులు 19,90,000లు, అసెంబ్లీ ఉద్యోగులు రూ.1,25,000లు...మొత్తం 2,91,43,466లు విరాళంగా అందజేయనున్నారని స్పీకర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు.

Related Posts