YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

ఆసియా కప్ ఫైనల్ బంగ్లా వర్సెస్ భారత్

 ఆసియా కప్ ఫైనల్ బంగ్లా వర్సెస్ భారత్

ఆసియా కప్ ఫైనల్ ముందు బంగ్లాదేశ్ జట్టుకు ఎదురు దెబ్బ తగిలింది. వేలి గాయం కారణంగా ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ తుది సమరానికి దూరమయ్యాడు. గాయం కారణంగా పాకిస్థాన్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లోనూ ఆడని షకీబ్ ఢాకా బయల్దేరి వెళ్లాడు. నాలుగు వారాల నుంచి ఆరు వారాలపాటు షకీబ్ జట్టుకు దూరం అవుతాడని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ అక్రమ్ ఖాన్ తెలిపాడు.  కొద్ది రోజులుగా వేలి నొప్పి ఎక్కువైంది. ఫిజియో ప్రయత్నించినా నొప్పి ఇంకా ఎక్కువైంది. నొప్పితోనే తొలి నాలుగు మ్యాచ్‌లు ఆడిన షకీబ్‌కు థ్యాంక్స్’ అని ఖాన్ తెలిపాడు. గాయం కారణంగా సెప్టెంబర్ 30 నుంచి జింబాబ్వేతో సొంత గడ్డ మీద ప్రారంభం కానున్న సిరీస్‌కు కూడా షకీబ్ దూరమైనట్టే. బుధవారం జరిగిన కీలక మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై 37 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో బంగ్లా జట్టు ఫైనల్ చేరింది. భారత్, బంగ్లా మధ్య శుక్రవారం ఫైనల్ జరగనుంది.
షియాకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన చివరి సూపర్ 4 మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓడిన సంగతి తెలుసు కదా. ఈ ఓటమితో పాక్ టోర్నీ నుంచి వెళ్లిపోయింది. ఒకవేళ మ్యాచ్ గెలిచి ఉంటే ఫైనల్లో ఇండియాతో తలపడాల్సి వచ్చేది. ఇప్పటికే ఈ టోర్నీలోనే రెండుసార్లు టీమిండియా చేతిలో పాక్ ఓడిన సంగతి తెలుసు కదా. ఈ విషయాన్ని గుర్తు చేసుకొని కనీసం ఇండియా చేతిలో వరుసగా మూడోసారి ఓటమిని తప్పించావు.. అది చాలు అంటూ అల్లాకు థ్యాంక్స్ చెబుతున్నారు పాకిస్థాన్ అభిమానులు. బంగ్లా చేతిలో ఓడిన పాక్ టీమ్‌తో ఆడుకుంటున్నారు. పాక్ టీమ్ యూఏఈలో చిక్కుకుపోయింది.. వాళ్లను రక్షించండి అని ఒకరు.. ఇండియా చేతిలో హ్యాట్రిక్ ఓటములను తప్పించుకోవాలంటే బంగ్లా చేతిలో ఓడాలి అని పాక్ టీమ్ అనుకున్నది అని మరొకరు.. ఇలా ట్విటర్‌లో రకరకాల కామెంట్స్‌తో విమర్శలు గుప్పిస్తున్నారు. కొందరు కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌పై విరుచుకుపడ్డారు. 95 మ్యాచ్‌లాడి కేవలం రెండు సెంచరీలు చేసిన వ్యక్తి కెప్టెన్ ఏంటి.. తప్పించండి అంటూ డిమాండ్ చేశారు.

Related Posts