బాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ రణ్ వీర్, దీపికా పదుకొనే వివాహం మరోసారి వహీదా పడింది. వాస్తవానికి వీరిద్దరూ నవంబర్ లో ఇటలీలోని సముద్ర తీరాన వివాహం చేసుకునేందుకు ముహూర్తం పెట్టేసుకున్నారని వార్తలు వచ్చాయి. పెళ్లి కోసం షూటింగ్ లు పెట్టుకోకుండా ఉన్నారని తెలుస్తున్న వేళ, పెళ్లి ముహూర్తం ఓ రెండు నెలలు వాయిదా పడ్డట్టు బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. దీనిపై అధికారికంగా స్పష్టత రావాలంటే, రణ్ వీర్ లేదా దీపికల్లో ఎవరో ఒకరు నోరు విప్పాల్సిందే.