YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కాంగ్రెస్ పునర్వవైభవం అంత వీజీ కాదు..

కాంగ్రెస్ పునర్వవైభవం అంత వీజీ కాదు..

రాష్ట్ర విభ‌జ‌న ఫ‌లితంగా కాంగ్రెస్ ఏపీలో తుడిచి పెట్టుకుపోయాయి. అయితే, ఇప్పుడు ఎలాగోలా క‌ష్ట‌ప‌డి పార్టీని బ‌తికించుకునేందుకు పార్టీ నేత‌లు ముమ్మ‌ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అయితే, అవి ఎక్క‌డా ఫ‌లించ‌డం లేదు. ఏపీలో పాత‌కాపుల‌కు పెద్ద పీట వేస్తామ‌ని ప్ర‌క‌టించి నాలుగు మాసాలు గడిచిపోయింది. కానీ, ఇప్ప‌టికీ ఏ ఒక్క‌రూ కూడా కాంగ్రెస్ గూటికి వ‌చ్చి చేరింది లేక‌పోగా.. కోండ్రు ముర‌ళి వంటి మాజీ మంత్రి మాత్రం మ‌ళ్లీ టీడీపీ కండువానే క‌ప్పుకొన్నారు. ఎన్నికలు సమీపించేసరికి కళ్లకు కమ్ముకున్న అధికారపు పొరలు నెమ్మదిగా విచ్చుకుని.. మళ్లీ రాష్ట్ర ప్రజలు, వారికి జరిగిన అన్యాయం గుర్తుకొస్తోందా అని కాంగ్రెస్ చంద్ర‌బాబును ప్ర‌శ్నిస్తున్నా.. ప్ర‌జ‌ల్లో ఇలాంటి విమ‌ర్శ‌ల‌ను ప‌ట్టించుకునే నాధుడు ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. బాబు వ్య‌తిరేకంగా రాజ‌కీయాలు చేయ‌డంలోను కూడా కాంగ్రెస్ విఫ‌ల‌మైంద‌ని సొంత పార్టీ సీనియ‌ర్లే ఆఫ్‌దిరికార్డుగా ఒప్పుకొంటున్నారు.  మేమొస్తే.. హోదా ఇస్తాం. హోదాపైనే నా తొలి సంత‌కం అని పార్టీ జాతీయ అధ్య‌క్షుడు, ప్ర‌ధాని అభ్య‌ర్థి రాహుల్ గాంధీ చేసిన ప్ర‌క‌ట‌న‌ను సైతం ప్ర‌జ‌ల్లోకి తీసుకు వెళ్ల‌డంలో కాంగ్రెస్ ఏపీ నాయకులు పూర్తిగా విఫ‌ల‌మైనట్టు తెలుస్తోంది. ప్రత్యేకహోదా గురించి ఆలోచించడం మానేసి.. ఆ బాధ్యత కాంగ్రెస్ కు వదిలిపెట్టాల‌ని అంటున్నా.. నాయ‌కుల‌ పిలుపును ప్ర‌జ‌లు అర్ధం చేసుకునే ప‌రిస్తితి మాత్రం క‌నిపించ‌డం లేదు. ర‌ఘువీరా కానీ, కేవీపీ రామ‌చంద్ర‌రావు కానీ ఔడేటెడ్ రాజ‌కీయాల‌తోనే నెట్టుకొస్తున్నార‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.  మ‌రీ ఇంత‌గా వెనుక‌బాటులో ఉన్న నాయ‌కులు ఎన్నిక‌ల్లో ఏం సాధిస్తారో వారికే తెలియాలి! కర్నూలు సభ సక్సెస్ అయిందని సంబర పడుతున్న కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు అదే ఊపుతో.. పాత ఓటు బ్యాంకుని ఆకట్టుకునేందుకు ప్లాన్లు వేసుకుంటోంది. ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ ఊమెన్ చాందీ.. ఇదే పని మీద ున్నారు. కింది స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీ సంస్ధాగత నిర్మాణంపై దృష్టి పెట్టారు. కాంగ్రెస్ క్యాడర్ అంతా ఎప్పుడో వైసీపీలోకి వెళ్లిపోయింది. మెల్లగా వారినందర్నీ… కాంగ్రెస్ పార్టీలోకి లాగేందుకు ప్రయత్నిస్తున్నారు. బూత్ కమిటీల నుంచి కార్యకర్తల్ని కూడ దీసుకునే ప్రయత్నం చేయాలని నిర్ణయించుకున్నారు. మండలాలు, గ్రామాలు, జిల్లా కమిటీల నియామకాలపై చాందీ కసరత్తు చేయబోతున్నారు. సంస్థాగతంగా బలపడటానికి వైసీపీలో ఉన్న కాంగ్రెస్ సానుభూతి పరుల్ని ఆకర్షిస్తున్నారు.2014 ఎన్నికలలో రాష్ట్ర విభజన కారణంగా ఒక్క నియోజకవర్గంలో కూడా డిపాజిట్లు దక్కించుకోని కాంగ్రెస్ ఈసారి ఓట్లశాతాన్ని పెంచుకునే దిశగా అడుగులు వేస్తుంది. ఇందుకోసం ప్రత్యేక హోదా అస్త్రాన్ని వాడుకోనుంది. కనీసం గౌరవప్రదంగా ఓటు బ్యాంక్ పెంచుకుంటే భవిష్యత్ ఉంటందని… కాంగ్రెస్ నేతలు ఆశ పడుతున్నారు. కనీసం మెజార్టీ స్థానాల్లో డిపాజిట్లు తెచ్చుకోవాలనేది వారి తాపత్రయం రాహుల్ గాంధీతో నెలకొక జిల్లాలో సభ పెట్టాలని నిర్ణయించుకున్నారు. వచ్చే నెలలో సభ ఎక్కడ నిర్వహించాలనే అంశంపై రేపోమాపో నిర్ణయం తీసుకోబోతున్నారు. రాహుల్ నెలకోసారి పర్యటిస్తే… పాత ఓటు బ్యాంకులు మొత్తం కాంగ్రెస్ వైపు వచ్చే అవకాశం ఉంది.పార్టీలోకి వచ్చే ఇతర నాయకులు కూడా చేర్చుకునేందుకు ఈ సమన్వయ కమిటీ సమావేశంలో ప్రణాళికను ఖరారు చేస్తారు. పార్టీని వదిలి వెళ్లిపోయిన.. దూరంగా ఉంటున్న నేతలను మళ్లీ పార్టీలో చేర్చుకునేందుకు చర్చలు ప్రారంభించబోతున్నారు. ఈ వ్యవహారాలన్నీ పైకి.. పార్టీ బలోపేతం లాగే ఉన్నాయి కానీ.. అసలు విషయం మాత్రం.. వేరే ఉంది. కాంగ్రెస్ ఎంత బలపడితే.. వైసీపీ అంతగా డ్యామేజ్ అవుతుంది. వైసీపీ డ్యామేజ్ అయితేనే.. కాంగ్రెస్ కు బలం.. అందుకే కాంగ్రెస్.. ప్రత్యేకమైన వ్యూహం పన్నుతోంది. జగన్ కు ఇబ్బందికరమే కాంగ్రెస్ వ్యూహం..!

Related Posts