YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు

భార్యను ‘రెడ్ హ్యాండెడ్’గా పట్టుకున్న భర్త ... తరువాత

భార్యను ‘రెడ్ హ్యాండెడ్’గా పట్టుకున్న భర్త ... తరువాత

హోటల్ రూమ్‌లో భార్యను ఆమె లవ్వర్‌తో సహా ఒక భర్త పట్టుకున్నాడు. తరువాత రోడ్డుపై గంటపాటు గొడవ జరిగింది. సమయం చూసుకుని ఆమె లవ్వర్ పారిపోయాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని భార్యాభర్తలను పోలీసు స్టేషన్‌కు తరలించారు. వివరాల్లోకి వెళితే ఉత్తర‌ప్రదేశ్ లోని హషిమ్‌పూర్ నివాసి సల్మాన్‌కు 14 నెలల క్రితం మనాకీ గ్రామానికి చెందిన యువతితో నిఖా జరిగింది. ఈ ఘటన సందర్భంగా సల్మాన్ మాట్లాడుతూ ‘నిఖా జరిగిన ఒక నెల తరువాత ఆమె కుటుంబ సభ్యులు ఆమెను తీసుకువెళ్లిపోయారు. తరువాత నేను చాలాసార్లు వెళ్లినప్పటికీ ఆమెను పంపించలేదు. ఆమె తప్పడు పనులు చేస్తోంది. బాయ్‌ఫ్రెండ్ బబ్లూతో పాటు హోటల్‌లో ఉండగా ఆమెను పట్టుకున్నాను’ అని తెలిపాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Related Posts