YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఫుల్ ఫామ్ లోకి వచ్చేసిన జనసేనాని

 ఫుల్ ఫామ్ లోకి వచ్చేసిన జనసేనాని

 పవన్ కల్యాణ్ మళ్లీ ఫామ్ లోకి వచ్చేశారు. కొన్నిరోజులు విరామం తర్వాత మళ్లీ దూకుడు మొదలుపెట్టారు. ఇప్పటికే యాక్షన్ ప్లాన్ రెడీ చేసేశారు. ఇన్నిరోజులు ప్రజా పోరాట యాత్రలతో ప్రజల్లోకి వెళ్లిన పవన్ కల్యాణ్ .. మళ్లీ జనంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రమంతా సుడిగాలి పర్యటనలు చేయబోతున్నారు. పార్టీ, కేడర్ ను బలోపేతం చేసే దిశగా దూసుకెళ్తున్నారు. ఎన్నికలకు ఇంకా 8నెలల సమయం ఉండగా.. ఈలోగా ప్రచారంలో దూకుడు పెంచి సత్తా చూపించాలనుకుంటోంది జనసేన. ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మళ్లీ జనంలోకి వచ్చేశారు. ఇప్పటివరకు సాగించిన ప్రజా పోరాట యాత్రకు కొంత కాలం విరామం ఇచ్చిన ఆయన.. మళ్లీ మలి విడత పర్యటనలకు సిద్దం అయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లాలో తన ప్రజా పోరాట యాత్రను కొనసాగించనున్నారు. దాదాపు పదిరోజులపాటు ఆయన జిల్లాలోనే మకాం వేయనున్నారు. రోజువారీ  భేటీలు కొనసాగిస్తూనే నిర్దేశించిన నియోజకవర్గాల్లో బహిరంగ సభలకు హాజరుకావాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. పార్టీ సిద్ధాంతాలను గ్రామాలకు చేర్చాలని...అందరికీ తెలిసేలా వివరించాలని ఇప్పటికే పవన్ కల్యాణ్ కేడర్ కు ఆదేశాలు జారీ చేశారు. క్షేత్ర స్థాయిలో మరింతగా బలపడాలని సూచించారు. పవన్ కళ్యాణ్ అంతకుముందు ప్రజాపోరాట యాత్రలో భీమవరం కేంద్రంగా చేసుకుని, పార్టీ వ్యవహారాలను, భేటీలను  కొనసాగించగా...ఇప్పుడు ఈ విడతలోనూ అదే తరహాలో యాత్ర కొనసాగించబోతున్నారని తెలుస్తోంది. అయితే ఈసారి తన సమావేశాలు, భేటీల సంఖ్య పెంచాలని...వీలైనంత ఎక్కువమందితో కలవాలని పవన్‌ కళ్యాణ్ నిర్ణయించినట్టు సమాచారం. కార్యకర్తలకు దిశానిర్దేశం చేసే నేతలు అవసరమని భావిస్తున్న జనసేన.. కొత్త నాయకత్వాన్ని తయారు చేసేందుకు కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణా శిబిరాలు నిర్వహిస్తోంది2019 ఎన్నికలే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు పవన్ కల్యాణ్. ప్రధాన పార్టీలకు ధీటుగా ఎదగాలని తాపత్రయపడుతున్నారు. అనుకున్నట్టుగానే పక్కా ప్రణాళికలు రచిస్తున్నారు. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రభావం ఏమేరకు ఉంటుందనేదానిపై ఏపార్టీ కూడా ఖచ్చితంగా సమాధానం చెప్పలేకపోతోంది. అలాగని ఆ పార్టీని ఏమాత్రం తక్కువగా అంచనా వేయడానికి వీలులేదంటున్నారు సీనియర్లు. రాష్ట్రంలో పోటాపోటీగా ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలు టీడీపీ, వైసీపీలకు మూడో ప్రత్యామ్నాయంగా జనసేన ఎదగాలని పవన్ కళ్యాణ్ పట్టుదలతో ఉన్నారు. సినీ స్టార్ గా ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్...రాజకీయాలపై ప్రశ్నించే వ్యక్తిగా అందరి ఆదరణ...... విస్తృత పర్యటనలతో ప్రజాపోరాట యాత్రకు వస్తున్న స్పందన...వీటన్నింటి తోడ్పాటుతో వచ్చే ఎన్నికల్లో సానుకూల ఫలితాలు రాబట్టాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కు యువత నుంచి పెద్దఎత్తున మద్దతు...మాస్ లో ఫాలోయింగ్ ఉండటంతో వాటిని ఓటు బ్యాంకులుగా మలుచుకునేందుకు జనసేన పకడ్బందీగా ప్రయత్నాలు చేస్తోంది. జ‌నసేన  రాజ‌కీయంగా ఏపీలో కీల‌కంగా మారుతోంది.. వైసీపీ – టీడీపీలో అసంతృప్తులు పార్టీ మారి, జ‌న‌సేన వైపు చూస్తున్నారు. పోటీ చేయ‌డానికి ఓ ప్లాట్ ఫామ్ కావాలి అని అనుకునే నాయ‌కులు, ఈ విధంగా ముందుకు వెళ్ల‌డానికి ఓ పార్టీని చూసుకుంటారు.. అయితే విజ‌యం మాత్రం ఎవ‌రికి వ‌స్తుంది అనేది చెప్ప‌డం క‌ష్టం, పైగా ఇప్పుడు జ‌న‌సేన దూకుడు చూపుతోంది…ప‌వ‌న్ కూడా రాజ‌కీయంగా చాలా దూకుడుగా ఉన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ పర్యటనలో ఆయా జిల్లాల్లో పెద్ద ఎత్తున ఇతర పార్టీల నుంచి లేదా ఇన్నాళ్లు క్రియాశీలకంగా లేని నాయకులు జనసేనలో చేరే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు నేతలు జనసేన ముఖ్య నేతలతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని పవన్ వారిని చేర్చుకోనున్నారు. జనసేన పార్టీలోకి కీలక నేతలు క్యూలు కడుతుండడంతో రాజకీయ వాతావరణం రసవత్తరంగా మారుతోంది. మరోవైపు ముమ్మిడివ‌రంలో బాల‌కృష్ణ చేరిక.. ఆయ‌న‌కు టికెట్ ప్ర‌క‌టించ‌డం ప‌వ‌న్ చేసిన రాజ‌కీయ తొలి ప్ర‌క‌ట‌న‌గా అంద‌రూ హ‌ర్షిస్తున్నారు. ఎన్నికలు క్రమంగా దగ్గరపడుతున్న నేపథ్యంలో పవన్ కల్యాణ్‌ ప్రచారం మరింత వేగం కానుందని అంటున్నారు. ఇప్పటికే జగన్, చంద్రబాబు ఓ రకంగా ప్రచారం ప్రారంభించేశారు. పవన్ కూడా ప్రారంభించారు కానీ మధ్యలో బ్రేక్ వచ్చింది. ఇక దాదాపు బ్రేక్ తీసుకోరని తెలుస్తోంది. ఇప్పటి దాకా చేసిన ప్రచారం ఓ ఎత్తు అయితే, ఇకముందు ప్రచారం మరో ఎత్తు అంటున్నాయి జనసేన వర్గాలు.

Related Posts