YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

ఇమ్రాన్ కాస్ట్ కటింగ్స్... గేదెలను కూడా వదల్లేదు

ఇమ్రాన్ కాస్ట్ కటింగ్స్... గేదెలను కూడా వదల్లేదు

అంతా పొదుపు మయం అంటున్నారు పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. దేశం లోటు బడ్జెట్‌లో ఉందంటూ.. పొదుపు చర్యల్ని ప్రారంభించారు. అధికారుల్ని అలర్ట్ చేస్తూ.. ఎక్కడ ఛాన్స్ దొరికినా ఆ లోటును పూడ్చే చర్యల్ని ఇప్పటికే ప్రారంభించారు. మొన్నే ప్రధాని నివాసంలో ఉన్న కారుల్ని వేలానికి పెట్టారు. ప్రభుత్వ శాఖల్లోని కార్లను కూడా వదలకుండా వేలం వేయించారు. అలాగే విలాసవంతమైన ఏ వస్తువును వదలడం లేదు. ఇలా పొదుపు చర్యలతో డబ్బును సమకూర్చే పనిలో బిజీగా ఉన్న ఇమ్రాన్.. చివరికి గేదెల్ని కూడా వదల్లేదు.లోటు బడ్జెట్ పూడ్చే పేరుతో.. ప్రధాని నివాసంలో ఉన్న ఎనిమిది గేదెల్ని కూడా గురువారం వేలానికి పంపించారు ఇమ్రాన్. ఈ ఎనిమిది గేదెల్ని బజారులో వేలానికి పెట్టగా.. బంపర్ ధరకు అమ్ముడుపోయాయంట. వీటిని అమ్మితే ఏకంగా రూ.23 లక్షలు వచ్చాయట. ఈ విషయాన్ని పాక్ మీడియా మొత్తం కోడై కూసింది. ఈ గేదెల్లో కూడా కాస్ట్లీ గేదె ఒకటి ఉందట. అది అత్యధికంగా రూ.3,85,000లకు అమ్ముడు పోయిందట. ఇక మిగిలిన గేదెలను ఇమ్రాన్‌ సొంత పార్టీ పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఈ-ఇన్సాఫ్‌(పీటీఐ) కార్యకర్తలు కొనుకున్నారట.మరోవైపు కార్లు, విలాసవంతమైన వస్తువుల్ని వేలానికి పెట్టిన ఇమ్రాన్‌పై ప్రతిపక్షాలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. పొదుపు అని చెప్పుకుంటూ.. వచ్చిన డబ్బుని ఇమ్రాన్ తన జల్సాలకు వాడుకుంటున్నారంటూ తెగ ఫైరైపోతున్నారట. కొంతమందైతే.. ఈ లెక్కల సంగతేంటో కూడా తేల్చాలని నిలదీస్తున్నారట.

Related Posts