YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

కళలు

భారత ఖండం ఒక అమృత భాండం ..

భారత ఖండం ఒక అమృత భాండం ..

నిర్మల సుర గంగాజల సంగమ క్షేత్రం
రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం
భారత దేశం మన జన్మ ప్రదేశం
భారత ఖండం ఒక అమృత భాండం                       || భారత దేశం || 

ఉత్తరాన ఉన్నతమై హిమగిరి శిఖరం
దక్షిణాన నెలకొన్నది హిందు సముద్రం
తూరుపు దిశ పొంగిపొరలె గంగా సంద్రం
పశ్చిమాన అనంతమై సింధు సముద్రం                  || భారత దేశం ||

ఒకే జాతి సంస్కృతి ఒకటున్న ప్రదేశం
రత్న గర్భ పేరుగన్న భారత దేశం
ధీర పుణ్య చరితలున్న ఆలయ శిఖరం
సత్య ధర్మ శాంతులున్న ప్రేమ కుటీరం                  || భారత దేశం ||

కోకిలమ్మ పాడగలదు జాతీయగీతం
కొండ కోన వాగు పాడు సంస్కృతి గీతం
గుండె గుండె కలుసుకొనుటె సమరస భావం
చేయి చేయి కలిపితేనె ప్రగతుల తీరం                    || భారత దేశం ||

Related Posts