పశ్చియ గోదావరి జిల్లా లోని కొల్లేరు లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం పర్యటించారు. ఈ సందర్బంగా అయన గుడివాకలంక గ్రామం వద్ద కొల్లేరు వాసులతో సమావేశయమయ్యారు. పవన్ మాట్లాడుతూ నాకు కొల్లేరుపైన అవగాహన ఉంది. గతం లో వచ్చాను కానీ దీని గురించి తెలుసుకోలేదు. సాంప్రదాయ మత్స్యకారులు ఈ కుట్రల మద్యలో నలిగిపోయారని అన్నారు.అందరి రాజకీయ నాయకులు లాగా సమస్య పరిష్కారం చేస్తానని చెప్పను, కానీ సానుభూతి వుంది. జయప్రకాష్ నారాయణ్, జేడీ లక్ష్మీ నారాయణ గారు వచ్చినప్పుడు లేని ఆంక్షలు, నా పర్యటన సమయంలో విధించారని ఆరోపించారు. ఇక్కడి నాయకులకు నేనంటే భయం. రాత్రి నాపై దాడి చేయటానికి వచ్చారు. నేను చేతులు కట్టుకుని కూర్చోను నా సంగతి తెలుసు కదా మక్కెలు ఇరగదీస్తానని అన్నారు. నా మీద దెబ్బ పడేకొద్ది నేను పెరుగుతానే తప్ప తగ్గను. కొల్లేరు పరిధిలో 110 కోట్లు పెట్టి 2 రెగ్యులేటర్ లు ఏర్పాటు చేస్తే కొల్లేరు అభివృద్ధి చెందుతుంది. అంటే ముఖ్యమంత్రి అయిన వెంటనే సమస్య పరిష్కారం చేస్తానని అన్నారు. నన్ను గెలిపించకపోయినా పర్వాలేదు కానీ నా వెనుక ఉండండి చాలు పోరాడి సాధించుకుందామని అన్నారు.