- 'వంగవీటి ' ఒక విశ్లేషణ"
"రామ్ గోపాల్ వర్మ 'వంగవీటి ' ఒక విశ్లేషణ": స్థూలంగా చెప్పాలంటే 1980-90వ దశకంలో విజయవాడలో పవర్ కోసం రెండు వర్గాల మధ్య జరిగిన హత్యల పరంపరే... "వంగవీటి". ఇటీవల కాలంలో తన స్థాయికి తగ్గ సినిమాలు తీయడంలో ఫెయిల్ అవుతోన్న వర్మ... ఈ సినిమాతో తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. నా మస్తిష్కం లోని శివ సినిమా జ్ఞాపకాల పొరలను ..ఒక్కొక్కటి ని, విడదీస్తూ వంగవీటిని తెరపై సమాంతరంగా ఆవిష్కరించి నన్ను, భావోద్వేగాల అనుభూతుల్లో ముంచివేశాడు .... రాము. సర్.. రియల్లీ ...హాట్స్. ఆఫ్. టూ. యూ...నిజ జీవిత కథలను , వ్యధలను , గాంగ్ వార్ లను అద్భుతంగా ఆవిష్కరించడంలో ఆరితేరిన వర్మ వంగవీటి విషయంలో మరోసారి తన సత్తా చాటాడు. సినిమాను ఎక్కువ భాగం తన వాయిస్ తో ప్లే చేస్తూ అసలు కథను డామినెటే చేసే సీన్లను ఎలివేట్ చేసే ప్రయత్నం చేశాడు.త్రి డైమెన్షన్స్ అఫ్ క్యారెక్టర్లను ప్రబోధించాడు. వాస్తవ కథలో జరిగిన కొన్ని సంఘటనలను గ్రిప్పింగ్‌గా గత స్థాయి మెరుపులను అద్దాడు. సత్యాన్ని నగ్నంగా ఎవరైనా మనముందు నిలబెడితే మన మెందుకో భుజాలు తడుముకుంటాము . ఈ సుదీర్ఘ మానవ జీవన స్రవంతిలో మనని మనం మోసం చేసుకుంటూ , అబద్దాలు ఆడుతూ, మానసిక వ్యభిచారం చేస్తూ జీవచ్చ్వాములా బతుకు బండి లాగుతున్నాము. మన రహస్య జీవితపు లోతుల్ని, మన మనో వికారాలని, మన నైజాన్ని ,ఓ మయా మాంత్రికుడు సినీ మయా దర్పణంలో ఆవిష్కరిస్తే అతని తో విభేదిస్తాం . రాంగోపాల్ వర్మ నిజాలు చెబుతున్నా, మనకు ... అబద్దాల్లా ...గోచరిస్తుంటాయి ఎందుకంటే? అతను ఎప్పుడు అద్భుత ప్రపంచాన్ని ఊహిస్తుంటాడు. సత్యాన్ని, నిజాయితీని, హేతుబద్దతను , ధర్మబద్ధతని ఈ రంగుల ప్రపంచం అంగీకరిస్తుందా ?ఇది నిరంతరం నా మస్తిష్కాన్ని తొలిచే ప్రశ్న ? తెలుగు సినిమా ని 360 డిగ్రీలో ఆవిష్కరించి ,తెలుగు వాడి సత్తాని భూ దిగంతాలకు తన ఈస్థటిక్ సొగసులతో చాటిచెప్పి... నిత్యం వోడ్కాను సేవిస్తూ సృజనాత్మక చైతన్మయంతొ సైలెంట్ గా వైలెంట్ని, తెరపై ఆవిష్కరించగల దమ్మున్నదార్శనిక దర్శకుడు వర్మ.సినిమా అంటే వాస్తవికత,వాస్తవికత తరిగి నప్పుడు కళ కలయే అవుతుంది.సినిమాకు వాస్తవికతను అద్ది సౌందర్యానికి నీతిని ఆపాదించి,ప్రేక్షకులకు ఇంద్రియానుభూతిని కలిగించి, సత్యం అనే హేతువాదాన్ని,శివం అనే నీతి వాదాన్ని,సుందరం అనే సౌందర్య వాదాన్ని ప్రభోదించిన దర్శక ధీశాలి రాంగోపాల్ వర్మ. సినిమా అంటే కౌశలంతో నిండినది,రసానందాన్ని పరిపూర్ణంగా ఇచ్చేది,సమాజానికి ప్రయోజనాత్మకంగా ఉండవలసినది.చారుదత్తుని గోడకు శర్విలకుడు వేసిన కన్నం ఆ చోరునకు అది అంత ఉపయోగపడింది, ఆ కన్నం రసాత్మకం,ఉపయోగాత్మకం కూడా!వర్మ విప్లవాత్మక ఆలోచనా ధోరణి, మనసు అంతరగాలను దర్శించగల సునిశిత దృష్టి,మనను వేదనల,సంవేదనలకు గురిచేస్తాయి. సినిమా ద్వారా సమాజానికి ప్రయోజనాన్ని చేకుర్చి నైతిక వాదుల ప్రశంశలని, విమర్శలని పొందిన దృశ్య వాచస్పతి వర్మ.ఒక్కొక్క కళకు ఒక్కొక్క బౌతిక మాధ్యమం అవసరం సినిమాకి ఆకట్టుకొనే పాత్రలు,సన్నివేశాలు,కథా కథనాలు సజీవమైన ఆత్మ, వాస్తవికత ఇవి ఉంటేనే సినిమాకి ఆకృతి ఏర్పడుతుంది లేకపోతే దర్శకునిలో మానవ సృష్టిగా మాత్రమే ఉండిపోతుంది. నన్ను నేను ఛార్జ్ చేసుకోవడానికి ప్రతిరోజు ఉదయం పోర్న్ వీడియోస్ చూస్తాను... నేను స్వార్ధపరుడ్ని....అని ధైర్యంగా ఎలుగెత్తి చాటే రెబెల్ వర్మ"నిగ్గదీసి... అడుగు... ఈ ...సిగ్గు ..లేని ..సమాజాన్ని .. అగ్గితో కడుగు ఈ సమాజ జీవచ్చ వాణ్ణి" .. అని నిరంతరం ప్రభోదిస్తుంటాడు ఈ సినిమా మహర్షి.
. సూర్య ప్రకాష్. సినిమా విశ్లేషకులు