టీమ్‌ఇండియా ఆసియా విజేతగా నిలిచింది. శుక్రవారం ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్లో 3 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది. స్పిన్నర్లు కుల్‌దీప్ యదవ్ (3/45), కేదార్ జాదవ్ (2/41), చాహల్ (1/31) అద్భుతంగా బౌలింగ్ చేయడంతో మొదట భారత్.. బంగ్లాను 48.3 ఓవర్లలో 222 పరుగులకే కట్టడి చేసింది. లిటన్ దాస్ (117 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో 121) శతకం సాధించగా సౌమ్య సర్కార్ (33), మెహదీ హసన్ (32) ఫర్వాలేదనిపించారు. కుల్దీ్‌పకు మూడు, కేదార్ జాదవ్‌కు రెండు వికెట్లు దక్కగా బంగ్లా ఇన్నింగ్స్‌లో ఎనిమిది మంది బ్యాట్స్‌మెన్ రెండంకెల స్కోరు చేయలేకపోయారు. ఆ తర్వాత లక్ష్యం కోసం బరిలోకి దిగిన భారత జట్టు 50 ఓవర్లలో 7 వికెట్లకు 223 పరుగులు చేసి గెలిచింది. భారత్ తరఫున ఒక్క బ్యాట్స్‌మన్ కూడా అర్ధసెంచరీ చేయలేదు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లిటన్ దాస్‌కు దక్కగా.. శిఖర్ ధవన్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు.