- 18న జమ్ముకశ్మీర్‌లో పెళ్లి
- 22న వరంగల్, 25న హైదరాబాద్‌లో విందు
- ఈనెల 26న హనీమూన్ ట్రిప్
- - ఈ నెల 18 నుంచి కలెక్టర్ ఆమ్రపాలి లాంగ్ లీవ్°
వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి వివాహం ఈ నెల 18న జరగనుంది. 2011 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి సమీర్ శర్మతో పెళ్లి జరగనుంది.ఢిల్లీకి చెందిన ఈయన ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతమైన డయ్యూ, డామన్‌లో ఎస్పీగా పని చేస్తున్నారు. త్వరలో పెళ్లి జరగనుండటంతో ఈ మేరకు ఆమ్రపాలి సెలవులో వెళ్లనున్నారు.
18న పెళ్లి
ఈనెల 18న జమ్ముకశ్మీర్‌లో ఆమ్రపాలి వివాహం ఘనంగా జరగనుంది. ఫిబ్రవరి 15 నుంచి మార్చి 7 వరకు కలెక్టర్ సెలవుల్లో ఉంటారు.
22న వరంగల్, 25న హైదరాబాద్‌లో విందు
ఈనెల 22న వరంగల్, 25న హైదరాబాద్‌లో ఆమ్రపాలి తన సన్నిహితులకు విందు
ఇవ్వనున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, పురప్రముఖుల సమక్షంలో రిసెప్షన్ నిర్వహించేందుకు ఇప్పటికే హోటల్స్ బుకింగ్స్ కూడా పూర్తయినట్లుగా తెలుస్తోంది.
హనీమూన్ ట్రిప్.. ఈనెల 26...
26 నుంచి మార్చి 7 వరకు భర్త సమీర్‌తో కలిసి ఆమ్రపాలి టర్కీ పర్యటన వెళ్లనున్నారు.