YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

నత్తతో పోటీ పడుతున్న టన్నెల్ నిర్మాణం

 నత్తతో పోటీ పడుతున్న టన్నెల్ నిర్మాణం

పోలవరం ప్రాజెక్టులో వివిధ ప్రాంతాల్లో స్టక్చ్రర్ల నిర్మాణం మందగమనంలో సాగుతున్నాయి. పోలవరం హెడ్ వర్క్సులోని ప్యాకేజీ నెంబర్ 63లో 900 మీటర్ల టనె్నల్ నిర్మాణం జరగాల్సివుంది. కుడివైపు కనెక్టవిటీలన్నీ ఈ టనె్నల్‌తోనే ముడిపడివున్నాయి. ఈ ప్యాకేజీలో మొత్తం రెండు వైపులా గట్లు, కాల్వలకు వీలుగా మట్టిపని, స్టిల్లింగ్ బేసి నుంచి వచ్చే నీటిని రెగ్యులేట్ చేయడం వంటి నిర్మాణాలున్నాయి. ఈ మొత్తం హెడ్ వర్క్సు పూర్తి చేయానికి రూ.72.81 కోట్లకు అగ్రిమెంట్ చేశారు. మొత్తం 24 నెలల్లో పూర్తి చేయాల్సి వుంది. ప్రధానంగా టెనల్స్ నిర్మాణం అతీగతీ లేకుండా వుంది. ఈ టనె్నల్స్, డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ లేకుండా గ్రావిటీపై 2019 నాటికి నీరివ్వడం ఎలా సాధ్యమో అర్ధం కావడం లేదు. కాఫర్ డ్యామ్‌లతో పాటు టనె్నల్స్ కూడా పూర్తికావాల్సివుంది. మరోవైపు ఇంకా పలు నిర్మాణాలకు సంబంధించి చాలా డిజైన్లు ఆమోదం పొందాల్సివుంది. ఈ పనులు 2005లో మొదలు పెట్టారు. వాస్తవానికి 2007లో పూర్తిచేయాల్సివుంది. ఇంకా ఈ పనులు పూర్తికాలేదు. ఇప్పటి వరకు రూ.40.20 కోట్ల విలువైన పనులు జరిగాయి. ఈ పనులకు సంబంధించి పోలవరం కుడి గట్టు వైపు మొత్తం 154.62 ఎకరాలు సేకరించి కాంట్రాక్టర్లకు అప్పగించారు. ఈ ప్యాకేజీలో ఒక ఎంట్రీ ఛానల్, ఒక ట్విన్ ఛానెల్, స్లూరుూస్, రెండు గట్లు నిర్మించాల్సివుంది. మొత్తం ఎనిమిది స్ట్రక్చర్లు నిర్మించాల్సివుంది. ఇందులో ఎనిమిది డిజైన్లు సమర్పించారు. రెండు గట్లు, ట్విన్ ఛానల్ కలిపి మొత్తం మూడు డిజైన్లకు ఆమోదం తెలిపారు. ఐదు డిజైన్లు పరిశీలనలో వున్నాయి. ఈ పనులకు సంబంధించి సుమారు 11 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పనికి గాను ఇప్పటి వకు సుమారు 5 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పని పూర్తయింది. కాంక్రీటు పని 81వేల క్యూబిక్ మీటర్లు జరగాల్సివుంది. ఇంకా కదలిక లేదు. ఎనిమిది స్ట్రక్చర్లకు గాను 37.5 శాతం మాత్రమే పనులు జరిగాయి. ఇక పోలవరం ప్యాకేజీ 64లో కుడివైపు 880 మీటర్ల పొడవైన టనె్నల్ నిర్మించాల్సివుంది. రూ.73.90 కోట్లకు అగ్రిమెంట్ జరిగింది. ఇదికూడా ఇరవై నాలుగు నెలల్లోనే పూర్తిచేసి 2007కల్లా అప్పగించాల్సివుంది. ఇప్పటి వరకు రూ.55.24 కోట్ల విలువైన పనులు జరిగాయి. దీనికి అవసరమైన సుమారు 72.70 ఎకరాల భూమిని అప్పగించారు. దీనికి సంబంధించి డిజైన్లలో ఒకటి పంపించడం జరిగింది. నాలుగు డిజైన్లకు ఆమోదం లభించింది. ఇందులో మట్టిపని 96.56 శాతం వరకు పూర్తయింది. కాంక్రీటు పని మాత్రం కేవలం 17 శాతం మాత్రమే పూర్తయింది.ప్యాకేజీ 65లో ఎడమ గట్టు వైపు కనెక్టవిటీలకు అనుసంధానంగా 919 మీటర్ల పొడవైన టనె్నల్ నిర్మిస్తున్నారు. మొత్తం సుమారు రూ.103 కోట్ల విలువైన పనులకు అగ్రిమెంట్ జరిగింది. ఇందుకు సంబంధించి అవసరమైన భూమిని సుమారు 134.50 ఎకరాలను నిర్మాణ సంస్థకు ఎపుడో అప్పగించారు. రెండు డిజైన్లకు గాను ఒకటి తిరిగి పంపించారు. మట్టి పని కేవలం 28.15 శాతం మాత్రమే జరిగింది. రెండు స్ట్రక్చర్లకు గాను ఒకటి నిర్మాణంలో వుంది. కాంక్రీటు పని అసలు జరగలేదు. ఇందుకు సంబంధించి కాంట్రాక్టర్‌ను మార్చే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. ఎడమ గట్టు వైపే మరో 890 మీటర్ల పొడవైన టనె్నల్‌ను నిర్మిస్తున్నారు. ఇది ప్యాకేజీ 66లో సుమారు రూ.77 కోట్ల అంచనా విలువతో చేపట్టారు. అవసరమైన భూమి 95 ఎకరాలను అప్పగించారు. కొన్ని డిజైన్లు పరిశీలనలో ఉన్నాయి. మరికొన్ని డిజైన్లకు ఆమోదం లభించింది. మట్టి పని 64.50 శాతం జరిగింది. కాంక్రీటు పని 33 శాతం పూర్తయింది. ఈ నిర్మాణ ప్రాంతంలో సత్యసాయి మంచినీటి పథకం పైపులైన్‌ను మార్చాల్సివుంది. మొత్తం మీద టనె్నల్స్ మాత్రం శరవేగంగా పూర్తి చేయాల్సి వుంది.

Related Posts