ఈ-ప్రగతిపై మాన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇన్నోవేషన్ హ్యాక్థాన్, ఆర్టీజీ, ఫైబర్గ్రిడ్, ఐవోటీపైనా సమీక్ష జరిగింది. మనం ఏంచేస్తున్నామనేది యూఎన్వో వేదికగా ప్రపంచానికి తెలియజేశానని తెలిపారు. రియల్ టైమ్లో భూగర్భజలాలు, వర్షపాతం, వాతావరణ పరిస్థితులు, జలవనరుల వివరాలు తెలుసుకోవడం అంతా ఆసక్తిగా గమనిస్తున్నారన్నారు. ఏపీ ఆర్ధికరంగంలో నాలుగో పారిశ్రామిక విప్లవం ప్రభావాన్ని ప్రపంచ బ్యాంకు అధ్యయనం చేసిందని చెప్పారు. ఇన్నోవేషన్ను అన్ని రంగాల్లో అమలుజేస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు.