YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

ఆ సీఎం అల్పాహారం ఖర్చు 68 లక్షలు..

ఆ సీఎం అల్పాహారం ఖర్చు 68 లక్షలు..

- అల్పాహారం కోసం ఆ సీఎం చేసిన ఖర్చు 68 లక్షలు.
- పన్నుల రూపంలో చెల్లించిన మన డబ్బే

ముఖ్యమంత్రి  క్యాంపు ఆఫీస్‌కు వచ్చిన ప్రతి అతిథికి మర్యాద చేయడం ఆ సీఎంకు అలవాటు. తమ పనులు, అవసరాల కోసం వచ్చే ప్రతి వ్యక్తికి.. కాస్త వారి ఆకలిని తీర్చే మనసున్న మనిషి ఆ సీఎం. అయితే ఇలా అల్పాహారం కోసం పది నెలల్లోనే రూ. 68 లక్షలు ఖర్చు చేశారు. ఇంతటి గొప్ప మనసున్న సీఎం ఎవరో తెలుసా? ఆయనే ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్. గతేడాది మార్చి 18న ఉత్తరాఖండ్ సీఎంగా త్రివేంద్ర సింగ్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. 

అయితే త్రివేంద్ర సింగ్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఈ ఏడాది జనవరి వరకు టీ, అల్పాహారం కోసం ఎంత ఖర్చు చేశారని నైనిటాల్‌కు చెందిన ఓ సామాజిక కార్యకర్త ఆర్టీఐకి దరఖాస్తు చేసుకున్నాడు. అల్పాహారం, చాయ్ కోసం పది నెలల కాలంలో రూ. 68,59,865లు ఖర్చు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ విషయంలో సీఎం త్రివేంద్ర సింగ్‌ను కొందరు మెచ్చుకుంటుంటే.. మరికొందరు విమర్శిస్తున్నారు. అల్పాహారం కోసం అధిక మొత్తంలో ఖర్చు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. రూ. 68 లక్షలు వృధా చేశారని సీఎంపై పలువురు ఆగ్రహం వెలిబుచ్చుతున్నారు. 

ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో నాలుగేళ్ల పాటు మంత్రుల టీ, స్నాక్స్ కోసం రూ. 9 కోట్లు ఖర్చు చేసినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

Related Posts