తిరుమల తిరుపతి దేవస్థానంలోని పురుష అధికారులు, తమను నిత్యమూ లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ, వందలాది మంది మహిళా ఉద్యోగులు రోడ్డెక్కారు. విష్ణునివాసంలో పనిచేస్తున్న అధికారులు కొందరు, అధికార పార్టీ అండతో తమను వేధిస్తున్నారని వారు ఫిర్యాదు చేశారు. విధులకు హాజరవుతున్న తమను, పడగ్గదుల్లోకి రావాలని అడుగుతున్నారని, తాము కాదంటే, సరిగ్గా పని చేయడం లేదంటూ విరుచుకుపడుతున్నారని పలువురు మహిళలు ఆరోపించారు. ఈ విషయంలో విచారణ జరిపించి, చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో మహిళలు తమ ఆందోళన విరమించారు.