శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఈ వపర్ యుద్ధం ప్రారంభమైంది. ప్రభుత్వం పలు శాఖలకు బడ్జెట్ కేటాయింపులు చాలా దారుణంగా కేటాయించడంతోనే విద్యుత్ బకాయిలను చెల్లించడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు తమ వినియోగ చార్జీలను సకాలంలో చెల్లించడం లేదు. ఏళ్ల తరబడి ఇదే పరిస్థితి. ఇప్పుడు ఆ పెండింగ్‌లు సుమారుగా రూ. 85 కోట్లు వరకు పేరుకుపోయాయి. దీంతో విద్యుత్ పంపిణీ సంస్థల ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పెండింగ్ బకాయిల శాఖలపై పవర్ యుద్ధం ప్రకటించారు. ఎటువంటి వెనుకడుగు లేకుండా పలు కార్యాలయాల విద్యుత్ కనెక్షన్లను కట్ చేశారు. దీంతో చాలా ప్రభుత్వ కార్యాలయాల్లో పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న పంపిణీ సంస్థలకు ప్రభుత్వ శాఖల కార్యాలయాల నుంచి సుమారు వందల కోట్లలో విద్యుత్ బకాయిలున్నట్లు గుర్తించారు. ఈ మేరకు ఈనెలాఖరులోగా దాదాపుగా విద్యుత్ బకాయిలు చెల్లించకపోతే కఠిన నిర్ణయాలకు సిద్ధం కావాలని తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ అధికారులకు ఆదేశాలు పంపింది.ఈపీడీసీఎల్ ఆధ్వర్యంలో జిల్లా సర్కిల్ పరిధిలో ఉన్న పెండింగ్ బకాయిదారులు, ప్రభుత్వ శాఖల కార్యాలయాల వివరాలను సేకరించారు.. రాజకీయ ఒత్తిళ్లు మొదలైనప్పటికీ, అత్యవసర విభాగ శాఖలను మినహాయించి మిగిలిన ప్రభుత్వ శాఖల నుంచి బకాయిలను వసూళ్లు చేసేందుకు తీవ్ర యత్నాలు చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు ఎల్‌టీ కనెక్షన్లు గల ప్రభుత్వ శాఖల నుంచి రూ.5.56 కోట్లు బకాయిలుండగా, హెచ్‌టీ కనెక్షన్లు గల ప్రభుత్వ శాఖల నుంచి రూ.2.29 కోట్లు వరకు బకాయిలున్నాయి. కేవలం పంచాయతీ కార్యాలయాలు, మున్సిపాల్టీల వంటి స్థానిక సంస్థల నుంచి ఏకంగా రూ.75.34 కోట్లు వరకు విద్యుత్ బకాయిలున్నాయి. దీంతో జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థల నుంచి మొత్తంగా రూ. 82.99 కోట్లు వరకు బకాయిలున్నాయి. ఈమేరకు బకాయి వసూళ్లకు ప్రత్యేక బృందాలు జిల్లా వ్యాప్తంగా పర్యటిస్తున్నాయి.
దీంతో మరో రెండు నెలల్లో వార్షిక ఆదాయ అవసర నివేదిక (ఏఆర్‌ఆర్)ను విద్యుత్ నియంత్రణ మండలికి ఇంధన శాఖ సమర్పించాల్సి ఉంటుంది. ఇంత భారీగా ఉన్న పెండిం