కృష్ణాజిల్లాలోని పామర్రు లో మెయిల్ డ్రైన్ రెండు కిలోమీటర్లు 13 నుండి 20 వార్డు వరకు ఉన్నటువంటి మురుగునీటిని లంక కాలువలోకి చేర వేస్తూ ఉంటుంది. ఊరికి ఇదే మెయిన్ ద్రైను కానీ గత సంవత్సరం నర్ర బట్టి, ఈ డ్రైన్ లో గుర్రపుడెక్క జమ్మి కలుపు దట్టంగా పెరగటం వలన, కాలవకు అటు ఇటు ఆక్రమణలు రావటం, చెత్తాచెదారం కూడా కాలవలోకి వేయటం వలన మురుగు ప్రవహించకుండా నిల్వ ఉంటుంది.
దీనివలన దుర్గంధం వెదజల్లుతోంది. చుట్టుపక్కల వారు చాలా ఇబ్బంది పడుతున్నారు. దోమలు ఇతర కీటకాలు వలన ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. గుర్రపుడెక్క జమ్మి కలుపు బాగా పెరగటం వల్ల గ్రామస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. పామర్రు ముఖ్యమైన జంక్షన్. ఈ డ్రైను ను క్లీన్ చేయించి గ్రామస్తులకు సహాయం చేయగలరు.