ప్రముఖ జర్నలిస్టు రషీద్ కిద్వాయీ తన పుస్తకం ‘నేతా అభినేతా: బాలీవుడ్ స్టార్ పవర్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్’ ద్వారా ఒక విషయం వెల్లడించారు. ఆయన ఆ పుస్తకంలో రాసిన వివరాల ప్రకారం హీరోయిన్ కరీనాకపూర్ 2002లో రాహుల్ గాంధీని ఇష్టపడుతున్నట్లు తెలిపారు. అప్పట్లో కరీనాకపూర్ ఒక షోలో... సమాధానం చెప్పేందుకు సంశయిస్తూనే తాను రాహుల్‌తో డేట్‌ను ఇష్టపడతానని చెప్పారు. అయితే 2009లో కరీనాకపూర్ దీనికి విరుద్దంగా స్పందించారు. ‘అది ఒకప్పటి విషయం. అప్పట్లో నేను అలా ఎందుకు చెప్పానంటే... మా ఇద్దరి ఇంటిపేర్లకు ఎంతో ప్రాధాన్యత ఉంది. నేను రాహుల్‌ను ప్రధానిగా చూడాలనుకుంటున్నాను. నేను అతనితో డేట్ చేయాలని అనుకోవడం లేదని’ స్పష్టం చేశారు.