YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కిడారి హత్య వెనుక టీడీపీ నేతల సహకారం?

కిడారి హత్య వెనుక టీడీపీ నేతల సహకారం?
అరకు ఎమ్మెల్యే కిడారి మాజీ ఎమ్మెల్యే సోము హత్య కేసు ప్రీ ప్లాన్ డ్ మార్డర్ గా పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం. మావోయిస్టులు పక్కా ప్రణాళికతోనే కిడారిని హత్య చేసేందుకు అంతకుముందే ప్రయత్నించారని.. దీనికి స్థానిక టీడీపీ నేత సహకరించారని పోలీసులు గుర్తించినట్టు తెలిసింది.  కిడారి హత్యకు పథకం పన్నిన మావోయిస్టులు ఆయన సన్నిహితులైన అరకు నియోజకవర్గంలోని ఓ ఎంపీటీసీ స్థానిక మండల టీడీపీ నాయకుల సహకారంతో మట్టుబెట్టినట్టు పోలీసుల విచారణ లో తేలినట్లు సమాచారం.ఈ ఘటనలో టీడీపీ నేతలే కిడారి హత్యకు పావులుగా మారారన్నది వ్యక్తమవుతుంది. మావోయిస్టులు కిడారిని హత్య చేయాలనుకోగానే ముందుగా నియోజకవర్గంలో ఆయనకు వ్యతిరేకులైన వారి గురించి ఆరాతీశారు. అందులో మన్యంలో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ఓ వ్యక్తితో మాట్లాడి.. తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ ఎంపీటీసీని గత ఆగస్టులో రహస్య స్థావరానికి పిలిపించారు. ఎంపీటీసీ ద్వారా స్థానిక మండల టీడీపీ నాయకుడితో భేటి అయ్యి ఎమ్మెల్యేను మన్యంలోకి రప్పించేందుకు స్కెచ్ గీశారు. సెప్టెంబర్ 5న మావోయిస్టులు - ఎంపీటీసీ - స్థానిక మండల నేత భేటి అయ్యి చర్చలు జరిపారు. గ్రామంలోకి ఎమ్మెల్యే వచ్చే ముందు తమకు సమాచారం ఇవ్వాలని మావోయిస్టులు ఆదేశించారు..అనుకున్నట్టే సెప్టెంబర్ 19న గ్రామదర్శినికి రావాలని ఎమ్మెల్యేను స్థానిక టీడీపీ మండల నేత ఆహ్వానించాడు. ఆరోజు వస్తానని కిడారి చెప్పాడు. దీంతో ఈ విషయం మావోయిస్టులకు చేరవేశారు. కానీ అదే రోజు ఎమ్మెల్యే కిడారి భార్య అనారోగ్యం బారిన పడడంతో ఆయన ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అరుణ ఆధ్వర్యంలో మావోయిస్టు బృందం ఎమ్మెల్యే హత్యకు కాపుకాసింది. కానీ ఎమ్మెల్యే రాకపోవడంతో ఈ ప్లాన్ ఫలించలేదు.భార్య అనారోగ్యం వల్ల గ్రామదర్శినికి రాలేకపోయిన ఎమ్మెల్యే  ఈనెల 23న ఆదివారం వస్తున్నట్టు స్థానిక నేతలకు సమాచారం ఇచ్చాడు. వారు మావోయిస్టులకు సమాచారం అందించారు.. అనుకున్నట్టే రెండు వాహనాల్లో ఎమ్మెల్యే కిడారి మాజీ ఎమ్మెల్యే సోములు వచ్చారు. మావోయిస్టులు ఆపి హత్య చేశారు. మరో మావోయిస్టు దళం ఇతర వాహనాలను గిరిజన గ్రామస్థులను పాదచారులను అక్కడికి వెళ్లకుండా అడ్డుకుంది.ఇక ఎమ్మెల్యే - మాజీ ఎమ్మెల్యే హత్యల అనంతరం గంజాయి స్మగ్లర్ కావాలనే గిరిజనులను రెచ్చగొట్టి తనకు అడ్డుగా ఉన్న పోలీసులను టార్గెట్ చేసి పోలీస్ స్టేషన్ ను తగుల బెట్టేలా పురిగొల్పినట్టు పోలీసుల విచారణలో తేలింది.  ఆ స్మగ్లర్ పట్టుకొని పోలీసులు ఆరాతీయగా.. తనకు మావోయిస్టులతో సంబంధాలున్నాయని.. పోలీసులు పదే పదే గంజాయి కేసులు పెడుతుండడంతో కోపంతో ఇలా వారికి సహకరించానని వెల్లడించాడు. ఇలా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే హత్యలో ఇద్దరు టీడీపీ నేతలను స్మగ్లర్ ను రేపో మాపో పోలీసులు అరెస్ట్ చూపించే అవకాశాలున్నాయని సమాచారం.  

Related Posts