ప్రకాశం జిల్లా చీరాలలో జనసేన కార్యకర్తలు రోడ్డెక్కారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై దెందులూరు నియోజికవర్గం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వారు ఆందోళన చేపట్టారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించి అనంతరం గడియారం స్ధంబం సెంటర్ లో భైఠాయించి చింతమనేని కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చింతమనేని అనుచరులు జనసేన కార్యకర్తలపై గుండాయిజం చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. టిడిపి చింతమనేని పార్టీ నుండి సస్పెండ్ చేసి, చింతమనేని పై కేసు నమోదు విచారించాలని వారు డిమాండ్ చేశారు.