నిరుద్యోగులకు జీవన భృతి, వారి భవితకు భద్రతను ఇచ్చేదే "ముఖ్యమంత్రి యువనేస్తం" పథకం. "ముఖ్యమంత్రి యువనేస్తం" ఒక నిరంతర ప్రక్రియ, ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ హబ్ గా ఆంధ్రప్రదేశ్ ను ముఖ్యమంత్రి తీర్చిదిద్దనున్నారని మంత్రి శిద్దా రాఘవరావు అన్నారు. సోమవారం నాడు దర్శి గౌతమీ కాలేజీలో " ముఖ్యమంత్రి యువనేస్తం" అవగాహనా కార్యక్రమంలో అయన పాల్గోన్నారు. మంత్రిమాట్లాడుతూ ట్రిపుల్ ఐటీ, రామాయపట్నం పోర్ట్, మైనింగ్ మరియు హార్టీకల్చర్ యూనివర్సిటీలు ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నారని అన్నారు.