- భూ నిర్వాసితులకు అండగా ప్రభుత్వం
- ఏడాదిలో అనంతగిరి.. రంగనాయకి సాగర్
- మిడ్‌మానేరు టన్నెల్, అనంతగిరి పనుల పరిశీలన
- ఇరిగేషన్ మంత్రి హరీశ్‌రావు
కాంగ్రెస్ రైతుల పక్షమా లేక రైతుల వ్యతిరేక పక్షమో తేల్చుకోవాలని ఇరిగేషన్ మంత్రి హరీశ్‌రావు సవాల్ విసిరారు. ప్రాజెక్టులను అడ్డుకోవడమంటే రైతు ఆత్మహత్యలను ప్రోత్సహించడమేనని పేర్కొన్నారు. రైతుల శ్రేయస్సు కోరేవారెవరూ ప్రాజెక్టులను అడ్డుకో బోరని అన్నారు. కేసుల మీద కేసులు వేస్తూ, ప్రాజెక్టుల నిర్మాణాన్ని అడుగడుగునా అడ్డుకుంటున్నారని కాంగ్రెస్ నాయకులను దుయ్య బట్టారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ప్యాకేజీ 10లో మిడ్ మానేరుకు అనుసంధానంగా జరుగుతున్న టన్నెల్ పనులు, అనంతగిరి రిజర్వాయరు నిర్మాణ పనులను మంగళవారం మంత్రి హరీశ్‌రావు పరిశీలించారు. సిద్దిపేట జిల్లా శివారు, రాజన్న -సిరిసిల్లా జిల్లా ఇల్లంతకుంట మండలంలోని తిప్పారం గ్రామంలో ఆసియాలోనే అతిపెద్ద ఓపెన్ సర్జిఫుల్ సంప్ హౌస్ నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. అనంతగిరి రిజర్వాయరు10వ ప్యాకేజి టన్నెల్ పనులు, సర్జిఫుల్ పంప్ హౌస్ నిర్మాణ పనులు పరిశీలించారు. ప్రాజెక్టు పనుల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా సర్జికల్ పంప్ హౌస్, టన్నెల్ నిర్మాణ పనులకు సంబంధించి ఇరిగేషన్ అధికారులకు మంత్రి పలు ఆదేశాలు, సూచ నలు జారీ చేశారు.రిజర్వాయరులో మిగిలిన పనులకు సంబంధించిన పనులను అత్యంత వేగంగా పూర్తి చేయాలని కోరారు. నిర్ణీత సమయంలోపు అన్ని పనులు పూర్తి చేసి నీళ్లు అందించేలా చర్యలు చేపట్టాలని ఇరిగేషన్ అధికారులకు మంత్రి సూచించారు. రైతు సంక్షేమం, అభివద్ధి ధ్యేయంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం పని చేస్తున్నదని తెలిపారు. స్వయంగా రైతు బిడ్డ అయినందున ముఖ్యమంత్రి కేసీఆర్ కు రైతుల బాధలు, సాధక- బాధకాలు అన్ని తెలుసని హరీశ్ రావు చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఆసియాలోనే మరెక్కడా లేని విధంగా అనంతగిరి రిజర్వాయరులో 95 మీటర్ల ఎత్తు, 56 మీటర్ల వెడల్పుతో ఓపెన్ సర్జిఫుల్ పంప్ హౌస్ నిర్మిస్తున్నామని మంత్రి చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి తీసుకునే రెండు టీఎంసీల నీటిలో ఒక టీఎంసీ నీటిని ఎస్సారెస్పీ నుంచి నిజామాబాదు, వరంగల్, యాద్రాద్రి జిల్లాలకు సాగు నీరు అందిస్తామని మంత్రి వివరించారు. మరో టీఎంసీ నీటిని పైకి తెచ్చి అనంతగిరి, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్లను నింపి వాటి ద్వారా రాజన్న-సిరిసిల్లా, సిద్దిపేట, మెదక్ జిల్లాలకు సాగు నీరు అందిస్తామన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుసందానంగా సిద్ధిపేట- రాజన్న- సిరిసిల్లా జిల్లా సరిహద్దులో నిర్మిస్తున్న అనంతగిరి, రంగ నాయక సాగర్ ప్రాజెక్టు పనులను ఏడాదిలోగా పూర్తి చేస్తామన్నారు. ఇ ప్పటికే దాదాపు అ న్ని పనులు పూర్తి అయ్యాయని, ఇంకా 60వేల క్యూబిక్ మీటర్ల మట్టి పని మిగిలి ఉన్నదని, గ్రామస్థుల స హకారంతో 3 బండ్ పనులు పూర్తి చేశామని మంత్రి వివరించారు. అనంతగిరి రిజర్వాయరు విషయంలో సబ్ స్టేషన్ కావాలని, దానిపై ప్రత్యేక దృష్టి పెట్టి త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు చేపడుతామని మంత్రి పేర్కొ న్నారు.భూ నిర్వాసితులకు తెలంగాణ ప్రభుత్వం అం డగా ఉన్నదని, ఇళ్లకు నష్ట పరిహారాన్ని అందజేస్తున్నామని హరీశ్‌రావు తెలి పారు. సీఎం కేసీఆర్ ఆదేశాలు, సూచనలతో నిర్వాసితుల కోరిక మేరకు ఆర్‌అండ్‌ఆర్ కాలనీ నిర్మాణాలు సైతం చేపడుతున్నామని ఆయన చెప్పారు. ని ర్వాసితులకు శాశ్వత ఆదాయ వనరులు క ల్పించేలా ప్రభుత్వం తరపున గట్టి చర్యలు చే పడుతున్నట్లు మంత్రి పే ర్కొన్నారు. మంత్రి వెంట కాళేశ్వరం సీఈ హరిరాం, ఎస్‌ఈ వేణు, ఈఈ ఆనంద్, స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు.