Highlights
నేను చదువు పూర్తయ్యాక ఐ ఏ ఎస్. చేద్దామనుకున్నా. కానీ కష్టం అని ఆ ఆలోచన మానేశా. ఎమ్మెల్యే అయితే ఐఏఎస్ లను కంట్రోల్ చెయ్యచ్చనే ఆలోచన వచ్చింది. 1978 లో ఎమ్మెల్యే గా పోటీ చేసా. తర్వాత మంత్రి అయ్యా. ముఖ్యమంత్రి అయ్యానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విజన్ పెట్టుకుని పనిచేయ్యండి. కలలు కనడమే కాదు కష్టపడాలని యువతకు సూచించారు. మంగళవారం నాడు అయన ముఖ్యమంత్రి యువనేస్తం పథకం ప్రారంభించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ నాలెడ్జ్ ను ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకోవాలని సూచించారు. దీనికి ముఖ్యమంత్రి యువనేస్తం ఒక ఫ్లాట్ఫారంగా ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. యువతకు ప్లేస్మెంట్ వచ్చేలా నైపుణ్య సంస్థలతో శిక్షణ ఇప్పిస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఇన్నోవేషన్ కు పెద్ద పీట వేస్తున్నామని ముఖ్యమంత్రి ప్రస్తుత విధానంకంటే విభిన్నంగా పని చేయడమే ఇన్నోవేషన్ అని ఆయన అన్నారు. ప్రసంగంలో అయన జగన్ పై విమర్శలు కురిపించారు. నన్ను విమర్శించేవాళ్ళు ఏదైనా సాధించారా..? దొంగ లెక్కలు రాసుకుని అడ్డంగా దొరికిపోయాడు. తండ్రి వైఎస్ హయాంలో ఇష్టానుసారం దొంగ లెక్కలు రాసుకున్నాడు. జైలుకు వెల్తూ అందర్నీ అడుక్కుంటున్నాడు. ఏమి తెలియని వాళ్ళు రోడ్డెక్కి మాట్లాడుతున్నారు. మనకులం,మనవాడు అనుకుంటే ఎవరూ తిండి పెట్టరు. కేంద్రం సహకరించకపోయినా అభివృద్ధి చేసాం. సినిమాలు వేరు, జీవితం వేరు. 2004 లో టీడీపీ అధికారంలోకి వచ్చి ఉంటే సమైక్యాంధ్ర అభివృద్ధిలో ముందంజలో ఉండేదని అన్నారు. కేంద్రం మెడలువంచైనా రాష్ట్రానికి రావాల్సినవి సాధించుకుంటామని అయన అన్నారు.