ఆంధ్రప్రదేశ్ లో పూర్వవైభవం కోసం తాపత్రయపడుతోంది కాంగ్రెస్ పార్టీ. రాష్ట్ర విభజనతో అన్యాయం జరిగిందని తిరస్కరించిన ప్రజల్లో, మళ్లీ విశ్వాసం కల్పించేందుకు సర్వశక్తులూ ఒడ్డి ప్రయత్నిస్తున్నారు. ఏపీకి కేంద్రం బాకీ పడింది. హోదా దయాదాక్షణ్యాల మీద ఇచ్చేది కాదు. ఏపీ ప్రజల హక్కు.. మళ్లీ అధికారంలోకి వస్తే రుణం తీర్చుకుంటామని రాహుల్ కర్నూలు సభలో ప్రకటించారు.నిజానికి కాంగ్రెస్ గురించి పెద్దగా లెక్క చేసే పని లేకపోయినా, కాంగ్రెస్ కు పడే ప్రతి ఓటు, తన దగ్గర నుంచే వెళ్తుంది అనేది జగన్ నమ్మకం. అందుకే, కాంగ్రెస్ పరిస్థితి పై జగన్ సర్వే చేపించారు.ఈ సర్వేలో కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా 4 శాతం ఓటు బ్యాంకు పెరిగినట్టు తెలుసుకుని, జగన్ అవాక్కయ్యారు. 1 శాతం కూడా లేని కాంగ్రెస్ 4 శాతం వచ్చింది అంటే, అది తన మీద వ్యతిరేకతతో, తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళలేక, కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళిన ఓటు బ్యాంక్ గా జగన్ గుర్తించారుఅంతకుముందు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో కూడా తీర్మానం చేశారు. ప్రధానిగా యూపీఏ ప్రభుత్వం తొలి సంతకం పెడుతుందని భరోసా ఇస్తున్నారు. తాము చేసిన పొరపాటును దిద్దుకుంటామని ఆ ఛాన్స్ ఇవ్వాలని ఏపీ జనాల్లోకి వస్తోంది కాంగ్రెస్. అయితే కాంగ్రెస్ హోదా ఇస్తాం అని చెప్పటం, రాహుల్ గాంధీ కర్నూల్ సభ, కిరణ్ కుమార్ రెడ్డి రీ ఎంట్రీ తరువాత, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పై జగన్ ఒక సర్వే చేపించారు. . ఇప్పటికే టీడీపీని ఢీ కొట్టగలమా అన్న సందేహాలున్నాయి. ఉన్న బలం చాలదన్న నివేదికలు కళ్లముందున్నాయి. రాష్ట్రానికి అన్యాయం చేశారన్న అభిప్రాయం బలంగా ఉన్న మోడీ ప్రభుత్వానికి దగ్గరయ్యామన్న ప్రచారమూ జనాల్లోకి బాగానే వెళ్లింది. ఇక రాహుల్ రూపంలో కాంగ్రెస్ కూడా ఇక్కడ బలపడితే ఓటు చీలుతుందన్న భయం వైసీపీని నీడలా వెంటాడుతోంది. అందుకే జగన్ ఇప్పుడు కొత్త వ్యూహంతో, కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొద్ది పాటి నాయకులని కూడా తన పార్టీలోకి లాగేలా వ్యూహం రచిస్తున్నారు. ఈ బాధ్యత విజయసాయి రెడ్డికి అప్పచెప్పారు. మరి ఇది ఎంత వరకు ఫలిస్తుందో చూడాలి...