దసరా సెలవుల్లో, అక్టోబరు 10 నుంచి 18వ తేదీ వరకు జరగనున్న తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్స వాలలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాం కలుగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడీ జేఈవో కె.ఎస్.శ్రీనివాసరాజు పేర్కొన్నారు. భక్తులకు టీటీడీ అన్నప్రసాదం, విజిలెన్స్, ఆరోగ్య విభాగాలు విశేష సేవలందిస్తున్నాయని తెలిపారు. భక్తులు సంయమనంతో టీటీడీకి సహకరించి, స్వామివారిని దర్శించుకోవాలని జేఈవో కోరారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసే లక్షలాదిమంది సామాన్య భక్తజనులకు సేవలందించడంలో రాజీపడేదిలేదని పేర్కొన్నారు. సామాన్య భక్తులకు దర్శనం, వసతి, లడ్డూ ప్రసాదాలు, అన్నప్రసాద సౌకర్యాలను కల్పించడంలో రాజీకి తామలేకుండా సేవలందిస్తున్నామ న్నారు. పెరటాశి నెల సందర్భంగా సాధారణ రోజులలో కూడా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1, 2లు నిండిపోవడంతో పాటు బయట దాదాపు 2 కిలోమీటర్లు వరకు భక్తులు క్యూ లైన్లలో వేచి ఉంటున్నట్లు తెలిపారు. అధిక రద్దీ కారణంగా అక్టోబరు 6, 7, 13, 14, 20, 21వ తేదీలలో, వచ్చే శని, ఆదివారాలలో దివ్యదర్శనం, సర్వదర్శనం టోకెన్లను రద్దు చేశామని, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు పరిమిత సంఖ్యలో కేటాయించామన్నారు. తద్వారా సామాన్య భక్తులను వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1, 2ల ద్వారా అధిక సంఖ్యలో సర్వదర్శనానికి అనుమతిస్తున్నట్లు వివరించారు. అదేవిధంగా శని, ఆదివారాలలో వి.ఐ.పి. బ్రేక్ దర్శనాలను ప్రొటోకాల్ ప్రముఖులకు మాత్రమే ఇస్తున్నట్లు తెలిపారు. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశాల మేరకు తిరుమలలో పెరటాశి నెల శని, ఆదివారాలలో క్యూలైన్ల నిర్వహణకు అదనంగా 120 మంది సిబ్బందిని డెప్యూటేషన్‌పై నియమించినట్లు తెలియజేశారు. వీరు తమకు కేటాయిం చిన ప్రాంతంలోని క్యూలైన్లలోని భక్తులకు అవసరమైన తాగునీరు, అన్నప్రసాదాలు, మెడికల్, మరుగుదొడ్లు, పారిశుద్ధ్యం, ఇతర సౌకర్యాల ను పర్యవేక్షిస్తారని వివరించారు.