అక్రమ బాక్సైట్ను టీడీపీ ఎప్పుడూ ప్రోత్సహించలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారం జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో అయన మాట్లాడారు. కిడారి సర్వేశ్వర రావు,సోమలను మావోలు హత్యలు చేయడం చాలా బాధకరమని అన్నారు. మన పార్టీ లో తాజాగా చేరిన వ్యక్తిని మావోలు ట్రాప్ చేసి వీరి ఇద్దరి మూమెంట్ లను వాచ్ చేశారు.ఆ వ్యక్తి నుండి వచ్చిన సమాచారం ప్రకారమే ఈ హత్యలు చేశారని అయన అన్నారు. మావోలు సంచలనం కోసమే ఈ హత్యలు చేశారు. బాక్సైట్ తవ్వకాలను రాజశేఖరరెడ్డి టైంలోనే జరిగాయి. బాక్సైట్ తవ్వకాల కోసం రాజాశేఖర్ రెడ్డి క్యాబినెట్ ఆమోదం తెలిపాఉ. తరువాత తవ్వకాలను ప్రోత్సాహించారు. మేము అప్పుడు,ఇప్పుడు ఈ బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తున్నామని అయన స్పష్టం చేసారు. ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ మృతి పట్ల, ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి మృతికి సంతాపం ప్రకటించారు.