తూర్పుగోదావరి జిల్లా జగంపేట జగ్గంపేట మండలం రామవరం గ్రామం లో సుమారు 500 కోట్లతో నిర్మించిన పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పథకాన్ని జగ్గంపేట మోడల్ డిగ్రీ కళాశాల ప్రారంభోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 5వ తేదీన ప్రారంభించనున్నారు. ఈ సందర్బంగా బుధవారం జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, ఎస్పీ విశాల్ గున్నీ ఏర్పాట్లను పరిశీలించారు. పోలీస్ బందోబస్తు, సీఎం దిగే చోటు, ఎలిఫెంట్ కాన్వాయ్ సంబంధిత అంశాలపై అధికారులతో చర్చించి తగు సూచనలు ఇచ్చార. అనంతరం జగ్గంపేటలో చంద్రబాబు చేతులమీదుగా ప్రారంభించనున్న మోడల్ డిగ్రీ కళాశాలను పరిశీలించారు. ముఖ్యమంత్రి నిర్వహించే బహిరంగ సమావేశం ఏర్పాట్లను, వివిధ శాఖలు ఏర్పాటు చేయనున్న స్థాళ్లను పరిశీలించారు. సూచనలు ఇచ్చారు ఈ పరిశీలనకు ముందుగ జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, పురుషోత్తమపట్నం కి హెలికాప్టర్లో వచ్చి ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు