- అబద్దాలతో పార్లమెంటును తప్పు దోవ పట్టిస్తున్న మోడీ
- ఏది నిజమో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత బీజేపీ పై ఉంది
- టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క డిమాండ్
. ప్రజాస్వామ్యానికి రాజ్యాంగ బద్ద నిర్మితమైన దేవాలయం వంటి పార్లమెంట్ ను ప్రధాని నరేంద్ర మోడీ తన అబద్దాలతో ఎందుకు తప్పు దోవ పట్టిస్తున్నారో అర్థం కావడం లేదని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క మల్లు అన్నారు. దేశానికి కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రాన్నీ, రాజ్యాంగాన్ని అందించింది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మాట్లాడం మంచిదని సూచించారు..తలుపులు మూసి తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని మీరూ చేసిన ప్రకటన చిన్నపిల్లల మాటలను తలపిస్తోందన్నారు.కాంగ్రెస్ పార్టీ తలుపులు మూసి తెలంగాణ ఇచ్చిన సమయంలో ప్రతిపక్ష హోదాలో ఉన్న మీ పార్టీ ఎలా సమర్థించిందని ప్రశ్నించారు.tama వల్లే తెలంగాణ బిల్లు పాస్ అయింది.. అని వెంకయ్య నాయుడు, సుష్మా స్వరాజ్ పలు సందర్భాల్లో చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.. తలుపులు మూసి అప్రజాస్వామికి పద్దతిలో విభజన జరిగిందని మోడీ చేసిన ప్రకటనకు.. సుష్మ, వెంకయ్యాల ప్రసంగాలకు పొంతన లేదన్నారు. ఇదే సమయంలో తెలంగాణ ఇచ్చిన సోనియమ్మతో పాటు.. ఈ చిన్నమ్మ ను గుర్తించుకోవాలని సుష్మ చేసిన ప్రకటన మీరు మర్చిపోయినట్టు ఉన్నారు.
మోడీ చెప్పింది నిజం అయితే..
యితేమోడీ చెప్పింది నిజం అయితే.. తెలంగాణకు బీజేపీ అనుకూలం అనేది అపద్ధం అని అర్థం అవుతోందన్నారు.. నిజంగా బీజేపీ తెలంగాణకు అనుకూలం అయితే.. ఇప్పుడు ప్రధానిగా మీ వ్యాఖ్యలు పూర్తిగా అబద్దం.. ఇందులో ఏది నిజమో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత బీజేపీ మీద ఉందిన్నారు. కేవలం హావభావాలతో, ప్రసంగాలతో రాజకీయం చేయడం, మాటలతో మోసం చేసే ప్రధాని దొరకడం ఈ దేశ ప్రజల దౌర్భాగ్యం. మాటల గారడీతో నిజాలు దాచిపెట్టే ఇటువంటి ప్రధాని మరొకరు ఎవరు ఉండరని ఎద్దేవా చేశారు. తెలంగాణపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖలపై విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడులు తక్షణం స్పందించాలన్నారు.
దళిత ముఖ్యమంత్రి అయిన అంజయ్యను రాజీవ్ గాంధీ అవమానించారంటూ ప్రధాని మోడీ పార్లమెంట్ సాక్షిగా అబద్దాలు చెప్పారు. అంజయ్య కులం, అక్కడ జరిగిన ఘటన ఏమిటో తెలియకుండా.. మాట్లాడ్డం ప్రధాని మోడీ అవివేకానికి నిదర్శనం. ఘటనపై రాజీవ్ గాంధీ.. సీనియర్ పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వరరావుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టమైన వివరణ ఇచ్చారు. ఈ విషయాన్ని పొత్తూరి వారు తన పుస్తకంలో కుడా రాసుకున్నారు. అదికూడా తెలియకుండా.. మోడీ మాట్లాడ్డం ఆయన విచక్షణకే వదిలేస్తున్నామన్నారు. వాస్తవానికి ఆరోజు ఏం జరిగిందంటే.. ఒక కార్యక్రమానికి వెళ్లేందుకు అప్పటికే ఒక హెలికాప్టర్ ను అధికారులు సిద్ధం చేశారు. హెలికాప్టర్ మోయగలిగిన బరువుకంటే అధికంగా అందులో కూర్చున్నారు. ఈ విషయాన్ని స్వతహాగా ఫైలెట్ అయిన రాజీవ్ గాంధీ.. వెంటనే గుర్తించారు. ప్రమాదం జరక్కుండా చూడాలనే ఉద్దేశంతో..మరో హెలికాప్టర్ లో రావాలని సూచించారు. ఇటువంటి కీలక విషయాలు తెలియకుండా మీరు ప్రధనిగా కొనసాగుతున్నారు. ఒక విషయం గురించి ప్రసంగించే సమయంలో... అందుకు సంబంధించిన కనీస సమాచారం తెలుసుకోకపోవడాన్నీ ఏమనాలి అర్థం కావడం లేదన్నారు. తెలంగాణ ఆశించిన ప్రజానీకం, ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని పార్లమెంట్ సాక్షిగా అవమానించడాన్ని దేశ ప్రజలు గమని స్తున్నారు. సున్నితమైన అంశంపై తెలంగాణ జనాన్ని అవమానించేలా మాట్లాడటంపై.. ప్రజలకు తప్పకుండా సమాధానం చెబుతారు.
కేటీఆర్ నీకంత స్థాయి లేదు..
ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖలపై కేసీఆర్, కేటీఆర్ ఇంత వరకు ఎందుకు స్పందించలేదు? చరిత్ర తెలియని కేటీఆర్ తన స్థాయిని మరచి పెద్ద పెద్ద నేతలపై అడ్డగోలు విమర్శలు చేస్తున్నారు. పెద్దవాళ్లను విమర్శించినంత మాత్రాన కేటీఆర్ నువ్వు పెద్ద వాడివి అయి పోవన్న విషయాన్నీ గుర్తు పెట్టుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని విమర్శించె స్థాయి నీకు లేదు. దాదాపు పదేళ్ల పాటు ప్రధాని అయ్యే అవకాశం ఉన్నా కనీసం మంత్రి పదవి తీసుకోని చరిత్ర రాహుల్ గాంధీదని స్పష్టం చేశారు. తెలంగాణ వస్తే కుక్కకాపలా కాస్తానని, రాష్ట్రం ఏర్పడితే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని మాట చెప్పి... తెలంగాణ ఏర్పడగానే.. మీ నాయన ముఖ్యమంత్రి, నువ్వు, మీ బావ మంత్రి పదవులు అనుభవిస్తున్నారు. మీ అక్క ఎంపీగా ఉన్నవిషయం మర్చిపోయావా అని సూటిగా ప్రశ్నించారు. మన ఆలోచన, మన సంస్కృతి ఎలా ఉంటే మన భాష అలా ఉంటుందన్నారు..కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని లోఫర్, దద్దమ్మ అనడంతోనే నీ ఆలోచనలు, సంస్కృతి బయట పడుతోందని భట్టి విక్రమార్క అన్నారు.