బుధవారం విజయవాడ దుర్గగుడి పాలకమండలి సమావేశం జరిగింది. ఈ భేటీలో దసరా ఏర్పాట్లపై, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై పాలకమండలి సభ్యులు, అధికారులు పలు నిర్ణయాలు తీసుకున్నారు. తరువాత ఆలయ ఈవో ఈవో కోటేశ్వరమ్మ మీడియాతో మాట్లాడారు. దుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ నెల 10 నుంచి ప్రారంభమయ్యే దసరా ఉత్సవాలకు 15 లక్షలకు పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నాం. వినాయకుడి నుంచి అమ్మవారి దర్శనానికి క్యూలైన్లో వచ్చే వారికి మంచినీటితో పాటు, కదంబ ప్రసాదాలు ఏర్పాటు చేశామని అన్నారు. సాంసృతిక కార్యక్రమాలకు పెద్ద పీట వేశాం. గత సంవత్సరం మీద ఉత్సవాల ఖర్చులు తగ్గించాం... ప్రభుత్వం నుంచి రావాల్సిన నిదులపై మరోసారి ఉత్సవాల తర్వాత లేక రాస్తామని అన్నారు. దసరా 9 రోజుల్లో విఐపి లు ఉదయం 7 గంటలనుంచి 9 వరకు, మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల మధ్య అమ్మవారి దర్శనానికి రావాలని సూచించారు. వృద్ధులు, వికలాంగులకు విఐపి లకు కేటాయించిన సమయంలోనే అమ్మవారి దర్శనానికి రావాలని సూచించారు. .వారితో పాటు అదనంగా మరో వ్యక్తికి అమ్మవారి దర్శనానికి అనుమతి ఇస్తామని ఆమె అన్నారు.