తెలుగుదేశం పార్టీలో వచ్చే ఎన్నికల్లో ఎవరికి టికెట్లు దక్కుతాయి? ఎవరికి టికెట్లు దక్కవు? అనే అంశాల గురించి ఆ పార్టీ అనుకూల మీడియా వర్గాల్లో వస్తున్న కథనాలు ఆసక్తిదాయకంగా మారాయి. ఊరక రాయరు మహానుభావులు అన్నట్టుగా.. తెలుగుదేశం అనుకూల మీడియా ఇంత ముందుగా టికెట్ల గురించి కథనాలను రాస్తూ ఉందంటే.. ఇందులో ఏదో స్కెచ్ ఉండనే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తను చెప్పాలనుకున్నది తన అనుకూల మీడియా చేత చెప్పించడం చంద్రబాబుకు బాగా అలవాటు అయిన రాజకీయం. ఇలాంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో ఈ కథనాలు చర్చకు దారి తీస్తున్నాయి.
వారిలో రామ్మోహన్ నాయుడు, అశోక్ గజపతి రాజు, మురళీ మోహన్, రవీంద్రబాబు, కేశినేని నాని, మాగంటి బాబు, కొనకళ్ల నారాయణ, గల్లా జయదేవ్, శ్రీరాం మాల్యాద్రి, శివప్రసాద్, నిమ్మల, బుట్టారేణుక ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అయితే వీరిలో కొందరికి టికెట్ దక్కుతుందా? అనే అనుమానాలూ ఉన్నాయి. కొందరు పోటీకి అంత సిద్ధంగా లేరనే అంచనాలూ ఉన్నాయి.వచ్చేసారి మురళీ మోహన్ తను తప్పుకుని కోడలికి అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నాడని చాన్నాళ్లుగా ప్రచారం ఉంది. ఇక శివప్రసాద్ కు చంద్రబాబు వచ్చేసారి టికెట్ ఇచ్చే ప్రసక్తే లేదనే అభిప్రాయాలూ వినిపించాయి. అలాగే తను ఎమ్మెల్యేగా పోటీ చేయాలని నిమ్మల ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నాడని.. తను కాకపోయినా తన తనయుళ్లలో ఒకరికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని ఆయన అడుగుతున్నారని తెలుస్తోంది.పుట్టపర్తి నుంచి తనయుడిని కానీ, తను కానీ పోటీ చేయాలనేది నిమ్మల కోరిక అని సమాచారం. దాని కోసం ఎంపీ సీటును వదిలేసుకోవడానికి ఆయన రెడీగా ఉన్నాడని తెలుస్తోంది. అయితే టీడీపీ అనుకూల పత్రికలు మాత్రం.. నిమ్మల మళ్లీ ఎంపీగానే పోటీ చేస్తాడని అంటున్నాయి.ఇక హిందూపురం ఎంపీ సీటు విషయంలో పరిటాల శ్రీరామ్ కూడా ప్రయత్నాల్లో ఉన్నాడు. అయినప్పటికీ నిమ్మలకే హిందూపురం ఎంపీ సీటని టీడీపీ మీడియా తేల్చేయడం గమనార్హం. ఇక ఫిరాయింపుదారు బుట్టా రేణుకకు కూడా టీడీపీ అనుకూల మీడియా ఎంపీ టికెట్ ను ఖరారు చేసింది. కర్నూలు ఎంపీ సీట్లో టీడీపీకి ఉన్న బలమే అంతంతమాత్రం. అలాంటి చోట.. ఫిరాయింపుదారును మళ్లీ పోటీ చేయించడం విశేషమే.12 మంది సిట్టింగులకు టికెట్లు ఖాయమే అని.. మిగిలిన వారిలో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తారని తెలుగుదేశం అధికారిక మీడియా వర్గాలు నిర్ధారిస్తున్నాయి. దీన్నిబట్టి టీడీపీ టికెట్ల ఆశావహులు ఒక అంచనాకు రావొచ్చేమో!