YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అంతా తప్పుడు ప్రచారాలే

అంతా తప్పుడు ప్రచారాలే
ముఖ్యమంత్రి బాబు మానసిక స్దితి  బాగోలేదు. త్వరలోనే బాబు  బట్టలూడదీసుకోని రోడ్డుపై తిరిగిన ఆశ్చర్యం లేదు. రాష్టానికి ద్రోహం చేసిన కాంగ్రెస్ తోనే నేడు బాబు జతకట్టారని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ విమర్శించారు.  గురువారం అయన మీడియాతో మాట్లాడారు. టిడిపి,   కాంగ్రెస్ పొత్తు పై బాబు ప్రజలకు సమాధానం చెప్పాలి. రాష్టానికి బాబు సైంధవుడు. విభజన సమయంలోనే బాబు కాంగ్రెస్ తో లోపాయికారీ  ఒప్పందం చేసుకున్నట్లుగా ఉంది. తెలంగాణ కు వెళ్లి ఏం చెప్పి బాబు ఓట్లు అడుగుతారు. బాబు మీది ప్రేమ ఉంటే వాటేసుకోండి. ఎదుటి వారి వ్యక్తిత్వంపై దెబ్బ కొట్టాలని  చూస్తే ఊరుకోనని అయన హెచ్చరించారు. రాష్ట్ర సోమ్ముతో పోలవరం విహార యాత్రలా  ? కేంద్రం సోమ్ముతో  ప్రాజెక్టు కడుతూ  బాబు డబ్బా కొట్టుకుంటున్నారు. రాయలసీమ ఎక్కడ అభివృద్ధి జరిగిందో మంత్రి పరిటాల సునీత అత్మవిమర్శ చేసుకోవాలి. రాయలసీమ లో అభివృద్ధి జరగలేదని నేను చాలెంజ్ చేసి చెబుతానని అన్నారు. రాయలసీమ అభివృద్ధి మేము చర్చకు సిద్దం. గుంటూరు నగరానికి  ఈ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలి. నేను మంత్రిగా ఉండగా చేసిన అభివృద్దే తప్ప టిడిపి చేసింది శూన్యమని అన్నారు. గుంటూరు కు టిడిపి చేసిన ఒక్క పని ఉన్నా చెప్పాలి. రాజదాని పేరుతో  వ్యాపారం చేసుకోవడం తప్ప టిడిపి చేసిందేమి  లేదు. బాబు దొంగ మాటలకు  సీఎస్ దినేష్ కుమార్ వ్యాఖ్యలే నిదర్శనం. విభజన హామీ ల విషయంలో మన్మోహన్ సింగ్, మోడిల  ప్రసంగం మార్ఫింగ్ చేసి టిడిపి తప్పుడు ప్రచారం చేసిందని అయన ఆరోపించారు. టిడిపి తప్పుడు ప్రచారాలను ప్రజలకు వివరిస్తామని అయన అన్నారు. 

Related Posts