- కోరి కష్టాలు తెచ్చుకుంటున్న పవన్
- జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో జేపీ భేటీ
లక్షలాది అభిమానులున్న కోరి కష్టాలు తెచ్చుకుంటున్నారని లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ వ్యాఖ్యానించారు. భేటీ ముగిసిన అనంతరం పవన్‌తో సహా మీడియా సమావేశంలో మాట్లాడారు. విభజన సమస్యలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించామన్నారు. విభజన హామీలపై పవన్ పోరాటానికి మద్దతిస్తున్నట్టు జేపీ స్పష్టం చేశారు. అందరం కూర్చొని వేదిక ఏర్పాటు చేద్దామన్న పవన్ ఆలోచనకు మద్దతిస్తున్నట్టు జేపీ చెప్పారు. విభజన హామీలు, ప్రత్యేక హోదా సమస్యను గంటలో పరిష్కరించే సామర్థ్యం ఎవరికీ లేదన్నారు. విభజనతో దెబ్బతిన్న ఏపీకి న్యాయం జరగాల్సిందేనని డిమాండ్ చేశారు.
రెండు రాష్ట్రాల్లో సామరస్యభావన వెల్లివిరుస్తున్నాయని, రెండు రాష్ట్రాలకు న్యాయం జరగాలని తెలిపారు. రాజకీయాల కోసం ప్రజలను ఎందుకు బలి చేస్తారని విమర్శించారు. బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీ ఇస్తామని ప్రధాని హామీ ఇచ్చారని జేపీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. ఏపీకి పన్ను రాయితీలు ఎందుకు ఇవ్వరని జేపీ ప్రశ్నించారు. రూ.10వేల కోట్లు ఎక్కడ ఖర్చు చేశారో చెప్పాలని అన్నారు. ఏరు దాటాక తెప్పతగలేసేలా కేంద్రం తీరు ఉందని జేపీ ఎద్దేవా చేశారు.