గత నెలలో టోలిచౌకి లోని అజాన్ ఇంటర్నేషనల్ స్కూల్ లో మూడేళ్ల బాలికపై జరిగిన అఘాయిత్యం పై విద్యాశాఖ స్పందించింది. స్కూల్ కి సంబంధించిన ప్రైమరీ సెక్షన్ ను విద్యాశాఖ అధికారులు సీజ్ చేసారు. డిప్యూటీ డీఈవో వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ అనురాధ కలిసి అజాన్ ఇంటర్నేషనల్ స్కూల్ లో ప్రైమరీ సెక్షన్ ను సీజ్ చేశారు. అంతేకాకుండా ఇలాంటి పిల్లలకి సెక్యూరిటీ లేకుండా ఏ మాత్రం భద్రత కల్పించకుండా నడుపుతున్న స్కూల్స్ ఏవైనా సరే సీజ్ చేస్తామని అధికారులు తెలిపారు. ప్రైమరీ లో చదువుతున్న పిల్లల తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసారు. స్కూలులో చదువుతున్న 280 మంది పిల్లలకు సంబంధించిన ఫీజులు స్కూల్ వెనక్కి ఇస్తుందని తెలిపారు.