రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంద్రప్రదేశ్ పోలీస్ శాఖను పటిష్టంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా నే ఈ రోజు నెల్లూరు జిల్లాలో మూడు పోలీస్ స్టేషన్లు నిర్మాణం చేసి ప్రారంభించడం జరిగిందని ఉప ముఖ్యమంత్రి, హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. గురువారం
నెల్లూరు నగరంలో ని దర్గామిట్ట పోలీస్ స్టేషన్ నూతన భవనం ప్రారంభించిన తరువాత అయన మీడియాతో మాట్లాడారు.
కార్యక్రమంలో పాల్గోన్న మంత్రి నారాయణ మాట్లాడుతూ నెల్లూరు జిల్లా లో ని విడవలూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ ప్రారంబించడం జరిగింది అని, అలాగే నెల్లూరు నగరంలో రెండు పోలీస్ స్టేషన్ లు ప్రారంభించడం జరిగిందని అన్నారు. ఇటీవల జరిగిన రోట్టెల పండుగలో పోలీస్ శాఖ అద్భుతంగా ప్రజలకు సర్వీస్ చేసారు అని ఆయన అన్నారు, ప్రదానం గా ముఖ్యమంత్రి, పోలీసులు ప్రజలు ప్రెండ్లీ గా ఉండాలని సూచించారని అయన అన్నారు.