రూపాయి దారుణంగా పతనమైంది.స్టాక్‌మార్కెట్‌పై ముప్పేట దాడి జరిగింది. రూపాయి మారకం విలువ కొత్త జీవితకాల కనీస స్థాయికి పతనం అయింది అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ ముడిచమురు ధర 85 డాలర్లను దాటేసింది. దీంతో అమ్మకాల ఒత్తిడి తీవ్రం అయింది ఇవాళ డాలర్‌తో రూపాయి విలువ 73.77 పైసలుగా నిలిచింది. ఈ రోజే డాలర్ మారకంతో పోలిస్తే సుమారు 43 పైసలు పతనమైంది. చమురు ధరలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో.. రూపాయి విలువ పతనం కొనసాగుతూనే ఉంది. బుధవారం కూడాడాలర్‌తో రూపాయి మారకం విలువ 73.34గా నిలిచింది. మార్కెట్లు కూడా ట్రేడింగ్ అత్యల్పంగా మొదలు పెట్టాయి. ఇవాళ ఉదయం సెన్సెక్స్ 604 పాయిట్లు కోల్పోయింది. ప్రస్తుతం సెన్సెక్స్ 35 వేల 370.89 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతున్నది.సెన్సెక్స్ 36వేల స్థాయిని, నిఫ్టీ 11వేల మార్కును దిగిపోయి ముగిశాయి. దీంతో మరో రూ. 1.71 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద హరించుకుపోయింది.ఆటో, ఐటీ, బ్యాంకిం గ్, ఎఫ్‌ఎంసీజీ షేర్లలో భారీగా అమ్మకాలు జరిగాయి. ఎఫ్‌ఐఐలు మరో రూ. 1,550.04 కోట్ల అమ్మకాలు జరిపారు. సోమవారం 1,841.63 కోట్ల అమ్మకాలు జరిపిన విషయం తెలిసిందే. సెన్సెక్స్ నికరంగా 550.51 పాయింట్లు నష్టపోయి 35,975.63 వద్ద నిలిచింది. నిఫ్టీ 150.05 పాయింట్ల నష్టంతో 10,858.25 వద్ద ముగిసింది. చమురు ధరల పెరుగుదలకు తోడు రూపాయి విలువ పతనం కారణంగా వాణిజ్య లోటు పెరుగుతుందన్న భయాలు మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. రిజర్వ్ బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ మూడు రోజుల సమావేశం ప్రారంభం అయింది. పావుశాతం వడ్డీ రేట్లు పెంచవచ్చునన్న అంచనాలున్నాయి. అయితే ఆర్థికవ్యవస్థపై, ఇటీవలి లిక్విడిటీ సంక్షోభ పరిణామాలపై రిజర్వ్‌బ్యాంక్ చేసే వ్యాఖ్యానంపై ఆసక్తి నెలకొంది. ఆర్బీఐ పాలసీ సమావేశం నిర్ణయాల తర్వాత మార్కెట్ నిర్ణయాత్మకంగా కదిలే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.