YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

మరో కాంట్రావర్శి.....రారా..మినిస్టర్ సాంగ్

 మరో కాంట్రావర్శి.....రారా..మినిస్టర్ సాంగ్

'నోటా’ సినిమా విడుదల ఆపాలంటూ ఇప్పటికే వివాదాలు చుట్టుముట్టిన ఈ సినిమాలో తాజాగా విడుదలైన ‘హే మినిస్టర్.. చట్టం నీ చుట్టమేగా’ ప్రోమో సాంగ్ మరో వివాదానికి తెరతీసేలా ఉంది. శుక్రవారం విడుదలకు సిద్ధమవుతున్న ‘నోటా’పై ఇప్పటికే పలు అభ్యంతరాలు వెల్లడయ్యాయి. దీనిపై ఎన్నికల కమిషన్, హైకోర్టుకు ఫిర్యాదులు అందాయి. శుక్రవారం  రిలీజ్ సందర్భంగా చిత్రయూనిట్ మరో సాంగ్ ప్రోమో విడుదల చేసింది. ‘‘హే మినిస్టర్ థర్మకోల్‌తో కోట కడదాం.. రా మినిస్టర్, రారా... హే మినిస్టర్ చట్టం నీకు చుట్టమేగ.. రా మినిస్టర్’’ అంటూ ఈ పాట మొదలైంది. లెఫ్ట్‌లో వైను, రైట్‌లో సైను.. వైనా, సైనా.. రారా’’ అంటూ సాగింది. మరి, ఈ పాటపై కూడా అభ్యంతరాలు వెల్లడవుతాయో లేదో అనేది ఈ సినిమా విడుదలయ్యే వరకు చెప్పలేం. విజయ్ దేవరకొండ, మెహరీన్ జంటగా నటించిన ఈ చిత్రానికి ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించారు. కె.ఇ.జ్ఞానవేల్ రాజా నిర్మాత.

Related Posts