YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

బాలయ్య అల్లుడికే..వైజాగ్ ఎంపీ సీటు

బాలయ్య అల్లుడికే..వైజాగ్ ఎంపీ సీటు
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల హడావిడి రోజురోజుకూ పెరిగిపోతోంది. ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో రాష్ట్రంలోని పార్టీలన్నీ వ్యూహ ప్రతివ్యూహాలతో దూసుకుపోతున్నాయి. అధికార తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు పోటీ పోటీగా ప్రచారం నిర్వహించాలని భావిస్తుండగా, జనసేన ఎంట్రీతో ఈ సారి పోటీ రసవత్తరంగా మారనుంది. వచ్చే ఎన్నికల్లో త్రిముక పోరు తప్పదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి తరుణంలో తెలుగుదేశం అధిష్ఠానం రాష్ట్రంలోని ఎంపీ స్థానాలపై కన్నేసింది. ఎన్డీయే నుంచి బయటికి వచ్చిన తర్వాత బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఆ పార్టీ.. వచ్చే ఎక్కువ స్థానాలను గెలుచుకుని ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించాలని భావిస్తోంది. అందుకోసం రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాల్లో నిలబెట్టే అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. గత ఎన్నికల్లో గెలిచిన స్థానాల కంటే ఎక్కువ స్థానాలు గెలుచుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే కొంత మందికి ఎంపీ టికెట్ ఇవ్వబోతున్నామని ఆయా నేతలకు చెప్పడంతో వారు ప్రచారం కూడా మొదలుపెట్టేశారు. తాజాగా మరో ఎంపీ స్థానంపై టీడీపీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.బాలయ్య అల్లుడు శ్రీభరత్ గీతం అధినేత, మాజీ ఎంపీ, టీడీపీ ఎమ్మెల్సీ ఎంవీవీఎస్‌ మూర్తి మనువడు. విశాఖ జిల్లాకు చెందిన ఆయన ఆ పార్లమెంట్ స్థానంపై కన్నేశారు. గతంలో ఈ పార్లమెంట్ స్థానం పొత్తులో భాగంగా బీజేపీకి ఇచ్చింది టీడీపీ అధిష్టానం. ఇప్పుడు ఈ రెండు పార్టీలు వేరు వేరుగా పోటీ చేస్తుండడంతో విశాఖ పార్లమెంట్ స్థానంలో ఎవరిని దింపాలనే విషయంపై టీడీపీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎంవీవీఎస్‌ మూర్తి (80) కన్నుమూసిన విషయం తెలిసిందే. దీంతో ఈ స్థానంలో భరత్‌ను బరిలోకి దింపాలని టీడీపీ అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. బాలయ్య కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోవడంతో, విశాఖ టికెట్ శ్రీభరత్‌కే దక్కే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఇదే స్థానంపై ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు బీసీ సామాజిక వర్గానికి చెందిన గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆసక్తి చూపుతున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న బీజేపీ నేత కంభంపాటి హరిబాబు ఈ సారి అక్కడి నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా లేరట. ఆయన స్థానంలో మరో సీనియర్ నేతను నిలబెట్టాలని ఆ పార్టీ అధిష్టానం నిర్ణయించుకుందట. ఏపీలో ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ తరపున ఓ పారిశ్రామికవేత్త పోటీ చేస్తున్నారని తెలుస్తోంది.

Related Posts